MLA Vivekananda Strong Counters To Revanth Reddy: ఓఆర్ఆర్ విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తమని, కేవలం మంత్రి కేటీఆర్‌ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు ఆయన ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు. అసలు ORR బిడ్డింగ్‌పై రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని.. గాలి వార్తను బేస్ చేసుకోని ఆరోపణలు చేశారని అన్నారు. 10శాతం నిధులు కట్టాలని కేటీఆర్ ఒత్తిడి చేసారనే వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. పీసీసీ పదవిని అడ్డుపెట్టుకొని, నాలుగు పైసలు వెనుకేసుకోవాలని అన్నట్టుగా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని కౌంటర్ వేశారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడడని, మతిస్థిమితం కోల్పోయి అతడు వ్యాఖ్యలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
Amit Shah: కల్లోలిత మణిపూర్ రాష్ట్రానికి అమిత్ షా.. శాంతి కోసం రెండు వర్గాలతో చర్చలు..
ORR బిడ్డింగ్‌పై ఏ విచారణకు అయినా తాము సిద్ధమేనంటూ వివేకానంద సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆధారాలు లేకపోతే.. బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవికి గండం వచ్చిందని, పీసీసీ పదవి నుంచి రేవంత్‌ను తొలగించేందుకు కాంగ్రెస్ నాయకులంతా ఏకం అయ్యారని అభిప్రాయపడ్డారు. ఆ భయంతోనే.. తన పీసీసీ పదవిని కాపాడుకోవడం కోసం రేవంత్ నిరాధారమైణ ఆరోపణలు చేస్తున్నారన్నారు. 111జీవో ఎత్తివేయాలని లోకల్ కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీర్మానాలు చేశారని.. మరి వాళ్లనను కూడా సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. 111 జీవో ఎత్తివేయొద్దని, ఆ జీవో ఉండాలని.. ఆ గ్రామాల్లోకి వెళ్లి మాట్లాడే దమ్ము కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఉందా? అని నిలదీశారు. రఘునందన్ రావుకు దమ్ముంటే విచారణ చేయించాలని వివేకానంద ఛాలెంజ్ చేశారు.
Naveen Ul Haq: కోహ్లీకి నవీన్ ‘సారీ’ చెప్పాడా.. ఇదిగోండి ప్రూఫ్
కాగా.. 111 జీవో ఎత్తివేత వెనుక ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు 111 జీవో పరిధిలో అడ్డగోలుగా భూములు కొనుగోలు చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వాళ్లందరూ ఆ భూములు కొన్నాకే జీవోను ఎత్తివేస్తూ ఉత్తర్వులు తెచ్చారని ఆరోపించారు. అంతేకాదు.. ఔటర్ రింగ్ రోడ్డును కొల్లగొట్టేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నారని, రూ. లక్ష కోట్ల విలువైన ఈ కుట్రకు సీఎం కేసీఆర్ ఆశీర్వాదాలు ఉన్నాయని, ఈ వ్యవహారానికి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు అర్వింద్ కుమార్‌లు సహకరిస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వివేకానంద పై విధంగా ఘాటుగా స్పందించారు.