ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫిబ్రవరిలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక బీజేపీకి స్పష్టమైన మేజిక్ ఫిగర్ దాటింది. కానీ ముఖ్యమంత్రి ఎంపిక మాత్రం చాలా ఆలస్యం అయింది. దీనికి కారణం.. ఆ సమయంలోనే ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్లారు.
Atishi: మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషిని ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళ ప్రతిపక్ష నాయకురాలిగా ఉండబోతోంది. ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు అతిషిని తమ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న రేఖా గుప్తాని బలంగా ఎదుర్కొనేందుకు మరో మహిళా నేత అతిషిని ఆప్ రంగంలోకి దించింది. Read Also: Bhupathi Raju Srinivasa Varma: ఎన్డీఏ…
Anna Hazare: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోరంగా ఓడిపోయింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి స్వయంగా ఓడిపోయారు. ఈయనే కాకుండా పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులు కూడా ఓటమి చవిచూశారు. మొత్తం 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 48 చోట్ల బీజేపీ గెలుపొందగా,…
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. షాలిమార్‌బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. కాగా సీఎం రేఖా గుప్త అధికార నివాసం ఎక్కడ అన్నదానిపై చర్చమొదలైంది. సివిల్ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లా ‘శీష్ మహల్’ను ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శీష్ మహల్ లో ఉండబోనని ఆమె ఇప్పటికే స్పష్టం చేసింది.…
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అలాగే ఉప రాష్ట్రపతి ధన్‌కర్‌ను కూడా కలిశారు. అనంతరం కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీలో కొత్త శకం మొదలు కానుందని, అద్భుతమైన అభివృద్ధి జరగబోతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో కొత్త మార్పును చూడబోతున్నాం అని, ఇక నుంచి ఢిల్లీ మరోలా ఉంటుందన్నారు. ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి ఉండడం తనకు చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు తెలిపారు. గురువారం ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం…
NDA CMs Key Meeting: ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం దేశ రాజధానిలోని ఓ హోటల్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు.
Delhi CM Rekha Gupta: ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్త ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాంలీలా మైదానంలో ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 12:35 గంటలకి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.