Today (04-01-23) Business Headlines: హైదరాబాద్ టు కాకినాడ: హైదరాబాద్‌కు చెందిన గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్.. ఏపీలోని కాకినాడలో ఫార్మా ఇండస్ట్రీని ఏర్పాటుచేయనుంది. ఔషధాల తయారీకి కావాల్సిన ‘కీ స్టార్టింగ్ మెటీరియల్స్’, ఇంటర్మీడియెట్స్, యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రెడియంట్స్ మరియు ఫెర్మెంటేషన్ ప్రొడక్టుల కోసమే ఈ కొత్త ప్లాంట్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది.
Today (02-01-23) Business Headlines: హైదరాబాద్ బిర్యానీకి అత్యధిక ఆర్డర్లు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పండగ చేసుకుంది. దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల బిర్యానీలను మరియు రెండున్నర లక్షలకు పైగా పిజ్జా ఆర్డర్లను డెలివరీ చేసింది. 75 శాతం మందికి పైగా కస్టమర్లు హైదరాబాద్ బిర్యానీనే కోరుకున్నారని ట్విట్టర్‌లో నిర్వహించిన సర్వేలో తేలినట్లు స్విగ్గీ వెల్లడించింది.
Today (30-12-22) Business Headlines: ‘హైదరాబాద్ చాక్లెట్’ కొన్న రిలయెన్స్: సీనియర్ మోస్ట్ సినీ నటి శారద మరియు విజయ రాఘవన్ నంబియార్ సంయుక్తంగా 1988వ సంవత్సరంలో ప్రారంభించిన లోటల్ చాక్లెట్ కంపెనీని.. రిలయెన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చాక్లెట్ కంపెనీ ప్రస్తుతం సింగపూర్ సంస్థ సన్‌షైన్ అలైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి అనుబంధంగా.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది.
Today (26-12-22) Business Headlines: ఇండియా.. ‘ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్’: భారతదేశం ప్రపంచ ఔషధాగారంగా ఎదిగిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సరసమైన రేట్లు మరియు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో మందులను తయారుచేస్తూ ఇండియా.. ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అనే ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. ఆఫ్రికా దేశాలకు 50 శాతం, అమెరికాకు 40 శాతం, బ్రిటన్‌కి 25 శాతం, గ్లోబల్ వ్యాక్సిన్లలో 60 శాతం, WHO ఇమ్యునిటీ ప్రోగ్రామ్స్‌కి 70…
Today (23-12-22) Business Headlines: ఎయిర్‌టెల్-అపోలో దోస్తీ: ఆరోగ్య సంరక్షణ రంగంలో అధునాతన 5జీ టెక్నాలజీని వాడుకోవటానికి ఎయిర్‌టెల్ మరియు అపోలో హాస్పిటల్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 5జీ టెక్నాలజీతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను కూడా వినియోగించుకున్నాయి. హెల్త్‌నెట్ గ్లోబల్, ఏడబ్ల్యూఎస్ మరియు అవేషా అనే సంస్థలను కూడా కలుపుకొని కలనోస్కోపీ ట్రయల్స్ నిర్వహించాయి. కలనోస్కోపీ ట్రయల్స్.. అంటే.. పెద్ద పేగు పరిశీలనకు సంబంధించిన పరీక్షలను చేపట్టాయి.
Today (22-12-22) Business Headlines: ఆజాద్ ఇంజనీరింగ్ స్పెషల్ యూనిట్: హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ.. జపాన్ సంస్థ మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కోసం స్పెషల్ యూనిట్‌ని ఏర్పాటుచేస్తోంది. మేడ్చల్‌కి దగ్గరలోని తునికిబొల్లారం ప్రాంతంలో తలపెట్టిన ఈ యూనిట్ నిర్మాణానికి నిన్న బుధవారం భూమి పూజ చేశారు. సుమారు 165 కోట్ల రూపాయలు వెచ్చించి అందుబాటులోకి తేనున్న ఈ కేంద్రంలో స్టీమ్ లేదా గ్యాస్ ఎయిర్ ఫాయిల్స్‌ను తయారుచేసి మిత్సుబిషికి సప్లై చేస్తుంది.