PM Narendra Modi: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. అంతకుముందు సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. దేశ ప్రజలందరికీ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోట వద్దకు విచ్చేసే ముందు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు ప్రధాని. రాజ్‌ఘాట్‌కు వెళ్లిన మోదీ.. గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు.
త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరిస్తున్నామని ఆయన అన్నారు. దేశంలోని నలుమూలలా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందన్నారు. మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని స్మరించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ అనంతరం భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. త్యాగధనుల పోరాటాల ఫలితమే ఈ స్వాతంత్య్రమని ప్రధాని మోడీ వెల్లడించారు. 75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నామన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా ఓటమిని అంగీకరించలేదన్నారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదన్నారు.
దేశంలోని ప్రతిఒక్క పేదవారికి సహాయం అందేలా చేయడమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. దేశ ప్రజలు పునరుత్తేజంతో ఉండడమే మన బలమన్నారు. మన ముందు ఉన్న మార్గం కఠినమైనదని భారత ప్రజలను ఉద్దేశించి అన్నారు. మన సామర్థ్యం, ప్రజల చైతన్యం వల్ల ప్రపంచం మనదేశాన్ని చూసే దృష్టి మారిందన్నారు. 120 కోట్ల మంది ప్రజలు రాజకీయ సుస్థిరత ఫలితాల్ని ఇప్పుడు చూస్తున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అభివృద్ధిలో అందరూ భాగస్వాములవుతున్నారని తెలిపారు. సబ్‌కా సాత్ సబ్ కా వికాస్ ఫ ఫలాలు అందరికీ అందుతున్నాయన్నారు.
వచ్చే 25 ఏళ్లు 5 అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోడీ. అవేంటంటే.. 1.దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నారు. 2. బానిసత్వపు ఆలోచనను మనసులో నుంచి తీసిపారేయండి. 3. మనదేశ చరిత్ర , సంస్కృతి చూసి గర్వపడాలి. 4. ఐకమత్యంతో ప్రజలంతా కలిసి పనిచేయాలి. 5. ప్రతి పౌరుడు తమ బాధ్యతను గుర్తుంచుకుని పనిచేయాలి.
Independence Day Celebrations: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకకు జాతి సిద్ధం.. ముస్తాబైన ఎర్రకోట
దేశంలోని అన్ని భాషలను చూసి గర్వపడాలన్నారు. డిజిటల్ ఇండియా స్టార్టప్‌లు మన టాలెంట్‌కు ఉదాహరణలని గర్వంగా చెప్పారు. మనదేశం ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించిందన్నారు. నరుడిలో నారాయణుడిని చూసే సంస్కృతి మనదన్నారు. గ్లోబల్ వార్మింగ్‌కు మన పూర్వీకులు ఎప్పుడో పరిష్కారం చూపించారని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. కొడుకు, కూతురి మధ్య భేదం చూపిస్తే సమానత్వం రాదన్నారు. వేధింపుల నుంచి మహిళలు బయటపడేలా సంకల్పం తీసుకుందామని జాతినుద్దేశించి వ్యాఖ్యానించారు.