PM Modi: రేపు ఎర్రకోట నుంచి నరేంద్ర మోడీ ప్రసంగం.. తొలి ప్రధాని ఆయనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు వస్తున్న సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ ఏప్రిల్ 21వ తేదీన సూర్యాస్తమయం తర్వాత ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. సంప్రదాయం ప్రకారం.. ఎర్రకోట యొక్క ప్రాకారము నుండి ప్రధానులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కానీ, సిక్కుల మతగురువు తేజ్‌బహుదూర్400వ జయంతిని పురస్కరించుకుని.. ఎర్రకోటలో సంప్రదాయానికి భిన్నంగా.. సూర్యాస్తమయం తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు నరేంద్ర మోడీ.. అయితే, స్వాతంత్ర దినోత్సవం వేడుకల సమయంలో ప్రసంగించే ప్రదేశంలో కాకుండా మరో ప్రాంతంలో ఈ ప్రసంగం చేయనున్నారు..
Read Also: Guinness World Record: గిన్నీస్ రికార్డుల్లోకి ‘శునకం’.. ఎందుకో తెలుసా..?
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఎర్రకోటలోని పచ్చిక బయళ్ల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.. ప్రధాని మోదీ ప్రసంగానికి ఎర్రకోటను వేదికగా ఎందుకు ఎంచుకున్నారు? అనే అంశానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది.. 1675లో తొమ్మిదవ సిక్కు గురువు గురు తేజ్ బహదూర్ మరణశిక్షకు అప్పటి ముఘల్రాజు ఔరంగజేబ్ ఈ ఎర్రకోట నుంచే ఆదేశాలు జారీ చేసిన కారణంగా.. అందుకు ప్రతీకగా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.. ఎర్రకోట యొక్క ప్రాకారము నుండి ప్రధానులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కానీ, ప్రధాని మోడీ గురువారం రాత్రి 9.30 గంటలకు ప్రసంగిస్తారని, ఆయన ప్రసంగం సర్వమత శాంతి, వర్గాల మధ్య సామరస్యం గురించి ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు కాకుండా స్మారక చిహ్నంపై నుంచి మోడీ ప్రసంగించడం ఇది రెండోసారి. 2018లో ఆయన స్మారక చిహ్నం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత ఆజాద్ హింద్ పౌంజ్ ఏర్పాటు చేసిన 75వ వార్షికోత్సవాన్ని స్మరించుకున్నారు. .ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆయన ప్రసంగించిన విషయం తెలిసిందే.. ఇక, గురువారం జరిగే కార్యక్రమంలో 400 మంది సిక్కు సంగీత కళాకారుల ప్రదర్శనలు ఉండబోతున్నాయి.. ఈ సందర్భంగా మోడీ.. స్మారక నాణెం, తపాలా స్టాంపును కూడా విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.
మరోవైపు ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో.. భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.. ఎర్రకోట వద్ద 1,000 మంది ఢిల్లీ పోలీసులు, వివిధ ఏజెన్సీలకు చెందిన బలగాలతో కూడిన బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.. ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే ప్రదేశంతో సహా ఎర్రకోట ప్రాంగణంలో ఇప్పటికే 100కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎస్‌జీ స్నిపర్లు, SWAT కమాండోలు, గాలిపటాలు క్యాచర్లు, కనైన్ యూనిట్లు మరియు ఎత్తైన భవనాలపై షార్ప్‌షూటర్లతో సహా భద్రతా రింగ్… మొఘల్ కాలం నాటి కోట వద్ద మోహరిస్తున్నారు.. ఇక, కరోనా కేసులు మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో.. భౌతిక దూరం నిబంధనలను పాటించడం తప్పనిసరి అంటున్నారు అధికారులు.. శనివారం నగరంలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘర్షణలో తొమ్మిది మంది పోలీసులు మరియు ఒక పౌరుడు గాయపడిన నేపథ్యంలో.. ఎర్రకోట వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!