పల్లవి ప్రశాంత్..సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు ఇది. రైతు బిడ్డగా బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టి పల్లవి ప్రశాంత్ ఏకంగా సీజన్ 7 టైటిల్ ను గెలుచుకున్నాడు..అయితే అంతవరకు బాగానే వుంది.. కానీ అతడిని విజేతగా అనౌన్స్ చేసిన తరువాత ఫ్యాన్స్ విధ్వంసం సృష్టించారు.బిగ్‌బాస్ టైటిల్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో నుంచి ఊరేగింపుగా బయలుదేరాడు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ కూడా బయటకు రాగా, ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం…
గతంలో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం సబబేనని తెలిపింది. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నాయకులు స్పందించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేశారు. "ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో.. జమ్మూ కాశ్మీర్‌ను దేశంలోని ప్రధాన…
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. తమ ఓటమికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను ఒక పాఠంగా తీసుకుంటామని, తిరిగి మళ్లీ పుంజుకుంటాం బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ మిస్ అయినప్పటికీ.. అతను అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. గిల్ 92 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. శుభ్‌మన్ గిల్ క్రీజులో నుంచి ముందుకొచ్చి ఆఫ్ సైడ్ అద్భుత షాట్ ఆడాడు. అది చూసి నాన్-స్ట్రైక్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు.
లోకేష్ కామెంట్స్ పై మంత్రి అమర్నాథ్ రియాక్షన్ ఇచ్చారు. చంద్రబాబు స్కామ్ పై రుజువులు న్యాయస్థానంకు ఇస్తాం కానీ.. నీలాంటి దొంగలకు కాదని లోకేశ్ పై మండిపడ్డారు. 13చోట్ల చంద్రబాబు సంతకం పెడితే అంత కంటే ఇంకేమి రుజువు కావాలని ప్రశ్నించారు. సీమెన్స్ సంస్థ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చిన వాంగ్మూలమే నిదర్శనమన్నారు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జడేజా చాలా సింపుల్ క్యాచ్ విడిచిపెట్టాడు. ఆ క్యాచ్ మిస్ చేసినందుకు ఫ్యాన్స్ తో పాటు.. భార్య రివాబా జడేజా కూడా ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం జడేజా భార్య రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తనతో ఒక్కరోజు మాత్రమే జీవించిన తన భర్త అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ దాఖలు చేసిన ఫిర్యాదుపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఈ కేసును చట్ట దుర్వినియోగానికి ప్రధాన ఉదాహరణగా పరిగణించింది. భార్య దాఖలు చేసిన ఫిర్యాదును సవాల్ చేస్తూ భర్త, అతని కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో వారిపై క్రిమినల్ ప్రక్రియపై మధ్యంతర స్టే విధించింది.. ఆ భార్యాభర్తలు బెంగళూరులోని మల్టీ నేషనల్ మోటార్‌బైక్ షోరూమ్‌లో సహచరులు. నాలుగు సంవత్సరాల…
ఏపీ రాజకీయాలు అంతకంతకు వేడెక్కుతున్నాయి. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇక ఈ ఘటనపై పలువురు ప్రముఖులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన తన స్వంత యూట్యూబ్ ద్వారా మాట్లాడుతూ ” చంద్రబాబు నాయుడుకు జరిగిన అవమానం చాలా దారుణం.. ఆయన ఏడవడం నాకు చాలా బాధగా అనిపించింది. నేను ఆయన పాలనలో ఉన్నప్పుడు…
‘పాగల్’… హీరో విశ్వక్ సేన్ చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. వాటిలో హిట్స్ అంటే ఒక్క ‘హిట్’ మాత్రమే. అదీ ఓ మాదిరి హిట్. అంతకు ముందు చేసిన వాటిలో ‘ఫలక్ నుమా దాస్’ సో..సో. అయితే ఇతగాడి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఇటీవల అతను పాల్గొన్న వేడుకల్లో స్పీచెస్ వింటే అది ఇట్టే అర్థం అవుతుంది. అప్పుడే తానో సూపర్ స్టార్ అయినట్లు ఫీలవుతుంటాడు. విజయ్ దేవరకొండ స్థాయిలో ఇమేజ్ వచ్చినట్లు బిల్డప్ ఇస్తుంటాడు.…