కృష్ణానది జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి… ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.. ఈ నేపథ్యంలో.. కృష్ణానది యాజమాన్యబోర్డు (కేఆర్‌ఎంబీ) రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించాల్సి ఉంది.. అయితే.. ఆ పర్యటన వాయిదా పటినట్టు ప్రకటించింది కేఆర్‌ఎంబీ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడిందని అధికారులు వెల్లడించారు. మళ్లీ ఎప్పుడు పరిశీలన చేసేది తర్వాత వెల్లడిస్తామని కేఆర్‌ఎంబీ తెలిపింది. కాగా, ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకున్నా.. రాయలసీమ…
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రేపు పర్యటించనుంది. ఎత్తిపోతల వద్ద పనులు జరుగుతున్నదీ లేనిదీ తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ బోర్డును ఇప్పటికే ఆదేశించింది. తొలుత తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న పథకాలను చూసి రావాలని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌జీటీ ఆదేశాల మేరకు పర్యటించి నివేదిక సమర్పించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఐతే..బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయకుండా నిర్ణయం తీసుకునేందుకు వీల్లేదని ఏపీ అభ్యంతరం…
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వ్యవహారం ఏపీ, తెలంగాణ మధ్య కాకరేపాయి.. పరస్పరం ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు.. ఇలా చాలా వరకే వెళ్లింది వ్యవహారం.. అయితే, విషయంలో కృష్ణా నది యాజమాన్యబోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), చెన్నై బెంచ్.. సొంతంగా తనిఖీలు జరిపి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తనిఖీలకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదన్న కృష్ణా బోర్డు నివేదనను పరిగణలోకి…
రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలని ఏపీకి కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఇరిగేషన్ సెక్రటరీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. అందులో డీపీఆర్ సమర్పించి, ఆమోదం పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దని ఏపీకి స్పష్టం చేసిన కృష్ణా బోర్డు… రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలంటూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలనూ లేఖలో ప్రస్తావించింది కేఆర్ఎంబీ. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందన్న అంశాన్ని లేఖలో పేర్కొన్న కేఆర్ఎంబీ… ప్రాజెక్టు సైటులో నిపుణుల బృందం పర్యటనకు ఏపీ సహకరించడం…