అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దని జాతీయ హరిత ట్రిబ్యూనల్ (NGT) తీర్పునిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి నిపుణులతో కమిటీ వేయాలని ప్రతిపాదించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టొద్దని సూచించింది.
Also Read: ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేస్తే జగన్ నాశనం చేస్తున్నాడు: నిమ్మల రామనాయుడు
ఈ ప్రాజెక్టు నిర్మాణం పై అధ్యయనానికి నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ వేయాలని, ఈ కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఏపీ సీఎస్‌పై కోర్టు ధిక్కార చర్యలు అవసరం లేదని పేర్కొంది. నిబంధలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎన్జీటీ బెంచ్ స్పష్టం చేసింది.