IND vs ENG Test: ఇంగ్లాండ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండవ రోజు లంచ్ సమయానికి పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 110 ఓవర్లలో 6 వికెట్లకు 419 పరుగులు చేసింది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ (1), శుబ్‌మన్ గిల్ (168) క్రీజ్‌లో ఉన్నారు. ఇక భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 288 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్స్‌తో 168 పరుగులతో…
ఈ రోజు (జూన్ 10న) ఉదయం పంత్ వాషింగ్టన్ సుందర్ తో కలిసి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ఓ భారీ సిక్సర్ కొట్టాడు.. అది నేరుగా వెళ్లి స్టేడియం పైకప్పుకి తగలడంతో బద్దలైపోయింది. ఇక, పంత్ కొట్టిన ఈ భారీ సిక్సర్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకున్నాక సమస్యలు మొదలయ్యాయి. వాళ్లిద్దరూ ఉన్నప్పుడే మరో కెప్టెన్ ని తయారు చేయాల్సిన గంభీర్ ఆ దిశగా ఆలోచించలేదు. ఫలితంగా టీమిండియా టెస్ట్ జట్టు బలహీనంగా కనిపిస్తుంది. టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుబ్ మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ పాత్ర పోషిస్తే,,, రిషబ్ ని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయొచ్చు. కానీ టెస్టుల్లో పెద్దగా అనుభవం లేని…
Ravindra Jadeja : గత కొద్దిరోజులుగా టీమిండియా ఫ్యాన్స్ కు వరుస షాకులు తగులుతున్నాయి. బిజిటి సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అశ్విన్ రూపంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తాజాగా వారం గ్యాప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ICT ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. నెక్స్ట్ రవీంద్ర జడేజా పేరు తెరపైకి వచ్చింది. జడేజా త్వరలోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు…
CSK vs MI: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 15.4 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపొందింది. ముంబై విజయానికి రోహిత్ శర్మ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)లో ఈరోజు ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నైని ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఉన్న జడేజా తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరారు. పుష్ప మ్యూజిక్, డైలాగ్‌తో అల్లు అర్జున్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. 'జడ్డూ అంటే పేరు కాదు బ్రాండ్' అని జడేజా చెప్పిన డైలాగ్ వీడియోను చెన్నై టీమ్ ట్వీట్ చేసింది.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో జడేజా తన బౌలింగ్ స్పెల్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీని హగ్ చేసుకోవడమే ఇందుకు కారణం. రిటైర్మెంట్ వార్తలపై జడ్డు ఫైర్ అయ్యాడు. హగ్ చేసుకుంటే రిటైర్మెంట్ అని రాస్తారా? అని మండిపడ్డాడు. దయచేసి పుకార్లు పుట్టించకండి అని జడేజా కోరాడు. ప్రస్తుతం భారత జట్టులో రోహిత్…
భారత్-న్యూజీలాండ్ మధ్య ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇరుజట్లు భీకరంగా పోరాడుతున్నాయి. అయితే ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ వేళ రవీంద్ర జడేజా రిటైర్ మెంట్ పై ఊహాగానాలు వెల్లువెత్తాయి. జడేజా రిటైర్ అవుతున్నారా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. జడేజా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి జడేజా…
ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరుగుతోంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో రవీంద్ర జడేజా రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు.