ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు. కెరీర్‌లో అత్యుత్తమ టెస్టు రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకిన సిరాజ్.. 12వ స్థానానికి చేరుకున్నాడు. హైదరబాదీ పేసర్ ఖాతాలో ప్రస్తుతం 718 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టడంతో సిరాజ్ దూసుకొచ్చాడు. అక్టోబర్ 10 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానున్న రెండో టెస్టులో…
India vs WI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. యువ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనుండగా.. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇకపోతే, ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన జట్టుతో పోలిస్తే కొన్ని స్వల్ప మార్పులు చేశారు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సిరీస్‌కు…
After Cheteshwar Pujara retirement Who’s Next in Team India: ‘నయా వాల్’ ఛెతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. పదిహేనేళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు పుజారా ఆదివారం (అగస్టు 24) స్వస్తి పలికాడు. ఇదే ఏడాదిలో ఆర్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా రిటైర్మెంట్ అయ్యారు. ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల మనస్సుల్లో ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. భారత జట్టులో తదుపరి ఎవరు రిటైర్మెంట్ తీసుకుంటారు?.…
Ravindra Jadeja: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. టెస్టు సిరీస్‌లో 6వ స్థానంలో లేదా అంతకంటే దిగువ బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఈ సందర్భంగా భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ రికార్డును అధిగమించాడు. 2002లో వెస్టిండీస్ పర్యటనలో లక్ష్మణ్ 474 పరుగులు చేసిన రికార్డును జడేజా బద్దలు కొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌లో…
ICC Rankings: భారత క్రికెట్ జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇక తాజా ర్యాంకింగ్స్ ప్రకారం.. ఐదుగురు భారత ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో అగ్రస్థానాన్ని సంపాదించారు. భారత జట్టు ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్‌లోని అన్ని ఫార్మట్స్ లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. టీమిండియా సుదీర్ఘ కాలంగా టెస్ట్, వన్డే, టీ20 క్రికెట్‌లో దూసుకెళ్లుతోంది. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలవడంతో భారత క్రికెట్‌కు మరింత శక్తిని తీసుకొచ్చింది. మరి ఎవరెవరు ఏ ఫార్మాట్ లో…
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 311 పరుగులు వెనుకబడి ఉంది. అంతేకాదు రెండవ ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (90), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (103) పోరాడారు. ఈ ఇద్దరు వెనుదిరిగినా.. వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్; 206 బంతుల్లో 9×4, 1×6), రవీంద్ర జడేజా (107 నాటౌట్;…
మాంచెస్టర్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌కు రవీంద్ర జడేజా కింగ్ అయ్యాడు. మ్యాచ్‌ను ఓటమి నుంచి డ్రాకు తీసుకెళ్తున్నాడు. భారత్ రెండవ ఇన్నింగ్స్‌లో జడేజా అర్ధ సెంచరీ సాధించాడు. 86 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో జడేజా ఇంగ్లాండ్‌లో 1000 టెస్ట్ పరుగులు కూడా పూర్తి చేశాడు. భారత ఆల్ రౌండర్ ఇంగ్లాండ్‌లో 30 టెస్ట్ వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ విధంగా, విదేశీ గడ్డపై 1000 పరుగులు, 30…
Ravindra Jadeja’s innings at Lord’s: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టడానికి పోరాట ఇన్నింగ్స్ ఆడాడు. జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, బ్రైడాన్ కార్స్‌ల పదునైన ఫాస్ట్ బౌలింగ్ ముందు టీమిండియా టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఓ సమయంలో భారత్ స్కోరు 7 వికెట్లకు 82 కాగా.. కాసేపటికి 8 వికెట్లకు 112గా మారింది. ఈ సమయంలో ఇంగ్లండ్ ఉదయం సెషన్‌లోనే మ్యాచ్‌ను ముగించేస్తుంది…
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రెండు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో జడ్డు రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు బాదడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 72 రన్స్ చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రవీంద్ర జడేజాకు ముందు ఈ రికార్డు…
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన భారత్ చారిత్రక విజయం అందుకున్న విషయం తెలిసిందే. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 271 పరుగులకు ఆలౌటవ్వడంతో.. టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు విజయంలో శుభ్‌మన్ గిల్ (269, 161), ఆకాశ్ దీప్ (10 వికెట్స్) కీలక పాత్ర పోషించారు. అయితే ఎడ్జ్‌బాస్టన్ టెస్టును మలుపు తిప్పింది రవీంద్ర జడేజా అనే చెప్పాలి. ఐదవ రోజు లంచ్‌కు ముందు ఏం…