సొంతగడ్డపై భారత్ ఘోర పరాజయంను చవిచూసింది. దక్షిణాఫ్రికాతో గువాహటిలో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (54) టాప్ స్కోరర్. టాప్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి, మార్కో యాన్సన్ చెరో వికెట్ తీశారు. ఈ ఓటమితో టీమిండియా టెస్ట్…
IND vs SA 2nd Test: గౌహతి బర్సాపారా క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికా మరోసారి బ్యాటింగ్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారత బ్యాట్స్‌మెన్స్ మొత్తం ఇబ్బందులకు గురిచేసిన ఈ పిచ్‌పై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ ప్రశాంతంగా ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో 260 పరుగులు చేసి తమ ఆధిక్యాన్ని 548 పరుగులకి చేర్చారు. దీనితో టీమిండియా ముందుకు భారీ లక్ష్యం వచ్చింది. టెస్ట్ చరిత్రలో స్వదేశంలో ఛేజ్ చేయాల్సిన అత్యధిక లక్ష్యం ఇదే కావడం విశేషం. Vijayawada: ఉచిత దర్శనం…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ WTC ఛాంపియన్స్ దక్షిణాఫ్రికా అద్భుతమైన ప్రదర్శన చేసింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో, దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సైమన్ హార్మర్ అద్భుతంగా బౌలింగ్ చేసి, మొదటి టెస్ట్‌లో మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. భారత్- దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగింది. Also Read:HYD: దాంపత్యాలు…
IND vs Sa Test: కోల్‌కతాలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో 159 రన్స్ కే ఆలౌట్ అయింది. భారతపేస్ దళ నాయకుడు బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో.. సఫారీ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం డిసెంబర్ 15న జరిగే అవకాశం ఉంది. వేలానికి ముందు 10 జట్లు నవంబర్ 15లోపు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించాలి. రిటెన్షన్‌కు తుది గడువు సమీపిస్తున్న నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. IPL 2026కి ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ సంజు శాంసన్ కోసం జడేజాను వదులుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సిద్ధమైందని తెలుస్తోంది.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం కోసం నవంబర్ 15 లోపు రిటైన్ లిస్ట్ ప్రకటించాలని 10 ఫ్రాంచైజీలకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిలీజ్ లిస్టుపై ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. తుది గడువుకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ప్లేయర్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో చెన్నై…
రివాబా జడేజా.. నిన్నామొన్నటిదాకా అంతగా ఫేమస్ కానీ ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యగా ముఖ పరిచయం కానీ.. పేరు అంతగా గుర్తింపు పొందలేదు. కానీ తాజాగా ఆమె పేరు ట్రెండింగ్‌లో నిలిచింది.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా వన్డే ప్రపంచకప్ 2027ను అక్టోబర్-నవంబర్లలో నిర్వహిస్తాయి. 2003 తర్వాత దక్షిణాఫ్రికా, జింబాబ్వే కలిసి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం ఇది రెండోసారి. ఈ టోర్నీలో టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇద్దరు ప్రపంచకప్‌లో ఆడుతారని కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ హింట్ ఇచ్చినా.. అందరికి అనుమానాలే ఉన్నాయి. వీరితో పాటు మరో ముగ్గురు కూడా మెగా టోర్నీలో ఆడడం డౌటే అని తెలుస్తోంది. రోహిత్ శర్మ: 1987లో…
ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు. కెరీర్లో అత్యుత్తమ టెస్టు రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకిన సిరాజ్.. 12వ స్థానానికి చేరుకున్నాడు. హైదరబాదీ పేసర్ ఖాతాలో ప్రస్తుతం 718 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టడంతో సిరాజ్ దూసుకొచ్చాడు. అక్టోబర్ 10 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానున్న రెండో టెస్టులో…
India vs WI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. యువ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనుండగా.. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇకపోతే, ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన జట్టుతో పోలిస్తే కొన్ని స్వల్ప మార్పులు చేశారు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సిరీస్‌కు…