Ravindra Jadeja: రవీంద్ర జడేజా చరిత్ర.. ప్రపంచంలోనే ‘ఒకే ఒక్కడు’!
- డబ్ల్యూటీసీలో రవీంద్ర జడేజా చరిత్ర
- 2000 పరుగులు, 100 వికెట్స్
- ఏకైక ఆటగాడిగా రికార్డుల్లో జడేజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో 2000 పరుగులు, 100 వికెట్స్ తీసిన ఏకైక ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో 89 రన్స్ చేయడం ద్వారా జడేజా ఈ రికార్డు నెలకొల్పాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో జడేజా తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 137 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 89 పరుగులు చేశాడు.
2021లో డబ్ల్యూటీసీ ప్రారంభం అయింది. రవీంద్ర జడేజా ఇప్పటివరకు 41 మ్యాచ్‌లు ఆడి 2010 పరుగులు, 132 వికెట్లు పడగొట్టాడు. డబ్ల్యూటీసీలో మూడు సెంచరీలు చేసిన జడ్డూ.. బౌలింగ్‌లో ఆరు సార్లు 5 వికెట్స్ పడగొట్టాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రమే జడేజాకు దగ్గరలో ఉన్నాడు. డబ్ల్యూటీసీలో స్టోక్స్ 2000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు కానీ.. 100 వికెట్లు తీయలేదు. 55 మ్యాచ్‌ల్లో 3365 పరుగులు చేసిన స్టోక్స్.. 86 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు జడేజా కేవలం 41 మ్యాచ్‌ల్లోనే 2000 పరుగులు చేసి.. 100 వికెట్లు తీసి ఔరా అనిపించాడు.
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
Also Read: Barlapudi Kranti: యాక్టివ్ అవుతున్న ముద్రగడ కుమార్తె.. జనసేన కీలక పదవిపై ఆశలు!
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో లోయర్ ఆర్డర్ పతనం తర్వాత రవీంద్ర జడేజా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ 211 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయినప్పుడు జడ్డూ బ్యాటింగ్‌కు వచ్చాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మద్దతు ఇవ్వడమే కాకుండా.. 203 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే జడేజా 11 పరుగుల తేడాతో తన సెంచరీ కోల్పోయాడు. జడేజాను జోష్ టంగ్ షార్ట్ పిచ్ డెలివరీతో క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!