మాస్ జాతరతో లాస్ట్ ఫోర్ ప్లాప్స్ లెక్కలు సరిచేయాలనుకుంటున్నాడు మాస్ మహారాజ్. సోలో హీరోగా ధమాకా తర్వాత హిట్ చూడని రవితేజ. ఈసారి మనం కూడా కొట్టినం అనే టాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ దిశగా తన వంతు కృషి చేస్తున్నాడు. తన కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీ అయిన ధమాకాలో యాక్ట్ చేసిన శ్రీలీలతో కలిసి మరోసారి జోడీ కట్టి మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. భాను భోగవరపు దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతోన్న ఈ మూవీ…
టాలీవుడ్ లో బంద్ఇంకా కొనసాగుతోంది. తమకు రోజు వారి వేతనాల 30% పెంచాలని కార్మిక సంఘాలు ఫిల్మ్ ఛాంబర్ ఒప్పుకోక పోవడంతో టాలీవుడ్ లో షూటింగ్స్ కు బంద్ ప్రకటించారు. దింతో ఎక్కడ షూటింగ్స్ అక్కడ నిలిచిపోయాయి. పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన సినిమాలు కూడా వాయిదా వేసాయి. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలు కూడా షూటింగ్స్ ఆగిపోయాయి. Also Read : Bollywood : స్టార్ హీరోల రికార్డ్స్ బద్దలు కొట్టి రూ.…
శ్రీలీల ఉంటే ఇక ఆ సినిమాలో స్పెషల్ సాంగ్స్ కోసం మరో భామను వెతకాల్సిన పని లేదు. ఎందుకంటే హీరోయిన్ రోల్‌కే కాదు ఐటమ్ నెంబర్‌కు ఫర్ ఫెక్ట్ ఛాయిస్‌గా మారిపోయింది. డ్యూయెట్ సాంగైనా, ఊర మాస్ పాటైనా మేడమ్ రచ్చ రంబోలా చేయాల్సిందే. స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్లకు నిర్మాతలు కోట్లు వెచ్చించి తెచ్చుకునే ఛాన్స్ లేకుండా కిసిక్ బ్యూటీ డ్యూయల్ రోల్ పోషించేస్తోంది. Also Read : Anushka : రెండేళ్లుగా హిట్ చూడని…
మాస్ మహారాజ రవితేజ హీరోగా భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమ ‘మాస్ జాతర’. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ధమాకా తర్వాత రవితేజ – శ్రీ లీల కాంబోలో వస్తున్న రెండవ సినిమా మాస్ జాతర. తెలంగాణ నేపథ్యంలో…
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘మాస్ జాతర’ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి.. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. మొదటి గీతంగా విడుదలైన ‘తు మేరా లవర్’ అందరినీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు రెండవ గీతంగా ‘ఓలే…
సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం మరవక ముందే అలనాటి నటి సరోజ మరణం అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. నిన్న రాత్రి రవితేజ నివాసంలో ఆయన కన్నుమూసినట్లు సమాచారం. Also Read:Kingdom : అన్నదమ్ములుగా విజయ్, సత్యదేవ్.. సాంగ్ ప్రోమో…
Kota Srinivas Death : కోట శ్రీనివాస్ మరణం అటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణంపై జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ సంతాపం తెలిపారు. ఎన్టీఆర్ తెలుగులో ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం.ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు…
Raviteja : హీరో రవితేజ గురించి చాలా మందికి ఒక విషయం తెలియదు. కెరీర్ లో ఎన్ని ప్లాపులు వస్తున్నా సరే కొత్త వారికి డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడంలో రవితేజ ఎప్పుడూ ముందుంటాడు. సొంతంగా ఎదిగిన హీరో కదా.. ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడం రవితేజకు మొదటి నుంచి అలవాటే. అందుకే కాబోలు ఆయన లిస్ట్ లో ప్లాపులే ఎక్కువగా ఉంటాయి. మరి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయొచ్చుకదా అనే వారు లేకపోలేదు. కానీ చాలా…
మాస్ మహారాజ రవితేజ మళ్లీ తన అభిమానులకు ఫుల్టూ ఎంటర్టైన్మెంట్ మూవీని అందించేందుకు రెడీ అయ్యాడు. రవితేజ నటించిన ‘మిరపకాయ్’ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా, ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. జులై 11న ‘మిరపకాయ్’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. హనుమాన్ మీడియా ఈ సినిమాను రీ…
Pawankalyan : పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. కానీ పాన్ ఇండియా కంటే ముందు టాలీవుడ్ ను ఏలింది పవన్ కల్యాణ్. అందులో నో డౌట్. అలాంటి పవన్ రెండు భారీ సినిమాలను మిస్ చేసుకున్నాడు. ఆ రెండు సినిమాలు చేసి ఉంటే ఆయన స్టార్ ఇమేజ్ మరో లెవల్ లో ఉండేదేమో. అందులో మొదటిది రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు…