Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: తెలుగు ఇండస్ట్రీలో అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి. ఫిబ్రవరి నుంచి మే వరకు ఒక్క హిట్ లేదు. జూన్‌లో మొదలైన సక్సెస్, ఆగస్టులో దూకుడు చూపిస్తోంది. ఈ నెలలో ఏకంగా నాలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సెకండ్ హాఫ్ కలిసి వచ్చింది. జనవరిలో సంక్రాంతి హిట్స్ తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో చూడడానికి ఐదు నెలలు పట్టింది. ఆ మధ్య వచ్చిన చిన్న లవ్ స్టోరీలు సక్సెస్‌కు దారి చూపించాయి. ఇంకేముంది, ఆగస్ట్ అంతా సక్సెస్‌తో మోత మోగిస్తోంది. ఈ నెలలో వచ్చిన సినిమాల్లో హిట్ కోసం స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ పోటీ పడ్డాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ తమిళంలో రూపొందినా, తెలుగు ఆడియన్స్‌కు బాగా నచ్చింది. తెలుగు రైట్స్ ను 21 కోట్లకు అమ్మితే, ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. 24 కోట్ల షేర్‌తో దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ఎవరు తీశారు, ఎవరు నటించారో తెలియకపోయినా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో బాగా ఆకట్టుకుంది.
క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. తెలుగులో ఒక్క ప్రమోషన్‌కు కూడా చిత్ర యూనిట్ రాకపోయినా, పాజిటివ్ మౌత్ టాక్‌తో తెలుగు బాక్సాఫీస్‌ను దోచేసింది. తెలుగు రైట్స్‌ను నాలుగు కోట్లకు అమ్మితే, ఇప్పటివరకు 20 కోట్లు వచ్చింది. ఈ నెలలో హిట్ అయిన సినిమాల్లో ఒక్కదానికి కూడా టికెట్ రేట్లు పెంచలేదు. నార్మల్ టికెట్ రేట్లకు విడుదలై బాక్సాఫీస్‌ను దోచేశాయి. టికెట్ రేట్లు పెంచితే పర్వాలేదన్న టాక్ వచ్చినా, ఆ రేట్లకు భయపడి పైరసీని నమ్ముకుంటారు.
అయితే, ఈ నెల సినిమాలకు ఆ ఛాన్స్ లేదు. టికెట్ రేట్లు పెంచకపోవడంతో థియేటర్స్ కళకళలాడాయి. సినిమా బాగుంటే ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారు, చూస్తారన్న నమ్మకాన్ని పెంచి, ఈ నాలుగు సినిమాలు అప్‌కమింగ్ మూవీస్‌లో ధైర్యం నింపాయి. ఏడేళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న వరుణ్ తేజ్‌కు ఊపిరి పోసింది. బ్లాక్‌బస్టర్ వసూళ్లు రాబట్టకపోయినా, లాభాలు తీసుకొచ్చింది. సరికొత్త కాన్సెప్ట్‌ను ఎంటర్టైన్మెంట్గా చూపించడంతో కొత్తగా అనిపించి తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. సినిమాను వరల్డ్‌వైడ్ 13 కోట్లకు అమ్మితే, 20 కోట్లు వచ్చింది.కొన్నేళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోలు సక్సెస్ దారి పట్టారు. రవితేజ సినిమా రిలీజ్ అయిన ఓపెనింగ్స్ చూస్తూ ఉంటే, ఈ రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇమేజ్ను కాకుండా కథను నమ్ముకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో మాస్ రాజాకు తెలిసింది.
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
తాజావార్తలు
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!