Irumudi Censor : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఇరుముడి’. ఈ నెల 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్ జారీచేసారు. మొత్తం 2 గంటల 25 నిమిషాల క్రిస్పీ రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేశారు. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఈ చిత్రానికి తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ ప్రధాన బలంగా నిలవనుందని, దానికి తోడు క్రైమ్ సస్పెన్స్ డ్రామా ఎలిమెంట్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయని తెలుస్తోంది. ముఖ్యంగా కథానాయకుడి పాత్ర అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత అతని ప్రవర్తనలో, క్యారెక్టర్లో వచ్చే మార్పులు సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. దర్శకుడు శివ నిర్వాణ టేకింగ్, కథనాన్ని నడిపిన తీరుతో పాటు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయని సమాచారం. ముఖ్యంగా ‘అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టు’, ‘మల్లెపూల పల్లకి’ పాటలతో పాటు ఆయన అందించిన రీ-రికార్డింగ్ ఈ చిత్రానికి ప్రధాన పిల్లర్స్‌గా నిలిచాయని చెబుతున్నారు. అయితే, ఈ చిత్రంలోని ‘మల్లెపూల పల్లకి’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్యామియో రోల్ చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. దీనిపై దర్శకుడు శివ నిర్వాణ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ‘మల్లెపూల పల్లకి’ పాటలో రామ్ చరణ్ క్యామియో ఉందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!