Shiva Nirvana: మాకు ముందే తెలుసు.. ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiva Nirvana: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో చాలా విజ్ఞప్తులు వచ్చాయి. అయితే, తాము ఈ సోషల్ మీడియా విజ్ఞప్తుల కంటే ముందే ఈ సాంగ్ పెట్టాలని అనుకున్నామని తాజాగా దర్శకుడు చెప్పుకొచ్చారు.
అలాగే, ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సింగర్ డప్పు శీను వాయిస్‌లో ఏదో వెలితి కనిపిస్తోందని, ఒరిజినల్ వాయిస్ బేస్‌తో సరిపోలడం లేదని సోషల్ మీడియాలో కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయం మీద దర్శకుడిని ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. నిజానికి తాము ఈ సాంగ్ ఎవరితో పాడించాలా అని అనుకున్నప్పుడు చాలా పేర్లు వినిపించాయని, నేపథ్య గాయకుల పేర్లు కూడా పరిశీలించామని, కానీ డప్పు శ్రీను గారితోనే పాడిస్తే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుందని భావించి ఆయనతోనే పాడించినట్లు చెప్పుకొచ్చారు. ఆయనను పిలిపించి హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో రికార్డింగ్ చేయించాక, తమకు కూడా అప్పటి వాయిస్ బేస్ ఎందుకో సరితూగలేదు అనిపించినట్లుగా ఆయన తెలిపారు.
Also Read
ఒరిజినల్ సాంగ్ ఆయన పాడి దాదాపు 15 ఏళ్లకు పైగానే పూర్తయింది. అప్పటినుంచి ఆ పాటనే యూట్యూబ్‌లో మనమందరం వింటూ వచ్చాం. అప్పటి ఆయన వయసు వేరు, ఇప్పుడు పాడినప్పుడు ఆయన వయసు వేరు. కొంత బేస్ తగ్గిన మాట వాస్తవమే, కానీ ఆయనకు మనం గౌరవం ఇవ్వాలని భావించి ఆ గౌరవం ఇచ్చాం. దీని మీద కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండవచ్చు, కానీ ఇది ఒరిజినల్ సింగర్‌కి తాము ఇవ్వాలనుకున్న గౌరవం అని ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?