Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 టాలీవుడ్‌కి ఒక మంచి సంవత్సరంగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఈ ఏడాది చాలామంది స్టార్స్ కంబ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాలకు హిట్ టాక్ వచ్చినా, ఆశించిన మేర కలెక్షన్స్ అయితే రాలేదు. కానీ ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో “బాస్ ఈజ్ బ్యాక్” అన్నట్టుగా రికార్డుల మోత మోగించారు.
ఇక అదే సీజన్లో రిలీజ్ అయిన ‘నారి నారి నడుమ మురారి’ సినిమా కూడా శర్వానంద్‌కి మంచి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కెరీర్లో వరుస ప్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్‌కి ఇది కొత్త ఊపిరి పోసినట్లు అయింది. అదే విధంగా అక్కినేని అఖిల్ కూడా ‘లెనిన్’ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు; ఏకంగా 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లి కూర్చున్నాడు. వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్న వరుణ్ తేజ్ సైతం ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో ఈ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది.
Also Read
- Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
- Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
ఇక రామ్ చరణ్ సైతం ‘గేమ్ ఛేంజర్’ లాంటి డిజాస్టర్ తర్వాత ‘పెద్ది’తో మంచి హిట్ అందుకున్నాడు. ఓవర్సీస్లో అక్కడక్కడా కాస్త బ్రేక్ ఈవెన్ కాకపోయినా, ఓవరాల్‌గా ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు తాజాగా రవితేజ ‘ఇరుముడి’ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. కరోనా తర్వాత రిలీజ్ అయిన ‘క్రాక్’ అనంతరం ఆయన చేసిన పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా, ఏదీ హిట్ టాక్ తెచ్చుకోవడం కాదు కదా, కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి.
కానీ ‘ఇరుముడి’ కంటెంట్ ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లడంతో పాటు, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్య ‘వీరభద్రుడు’ తర్వాత మరోసారి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో తెలుగులో సైతం మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాడు. అదేవిధంగా సమంత ‘మా ఇంటి బంగారం’, కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ వంటి సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాయి.
తాజావార్తలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!