మాస్ మహారాజా రవితేజ వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వాటిలో కొన్ని నిర్మాణ దశలో ఉండగా, పలు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇటీవలే ‘ఖిలాడీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పుడు ‘రావణాసుర’ చిత్రంలో నటిస్తున్నారు. సుశాంత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐదుగురు కథానాయికలు నటించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగార్కర్, పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, రచయిత శ్రీకాంత్ విస్సా కథను అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Read Also : AdiPurush : ఫారెస్ట్ సీక్వెన్స్ కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు
రామ్ పాత్రలో నటిస్తున్న సుశాంత్ మొదటి షెడ్యూల్‌లో భాగం కాగా, లాయర్‌గా కనిపించనున్న రవితేజ రెండో షెడ్యూల్‌లో టీమ్‌తో జాయిన్ అయ్యాడు. తాజాగాఓ పిక్ ను విడుదల చేస్తూ రెండో షెడ్యూల్‌ని పూర్తి చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ వర్కింగ్ స్టిల్‌లో టీమ్ అంతా థ్రిల్‌గా కనిపిస్తున్నారు. రవితేజ, సుశాంత్ మరియు ప్రధాన సాంకేతిక సిబ్బందితో పాటు, ఫోటోలో సినిమాలో ఒక హీరోయిన్‌గా నటిస్తున్న దక్ష నాగార్కర్ కూడా ఉన్నారు. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.