భారత క్రికెట్ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మళ్లీ టీమిండియాకు సేవలందించేందుకు రాబోతున్నాడా? అంటే.. అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఇప్పుడు రవిశాస్త్రి రీఎంట్రీ సోషల్ మీడియా, క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2029 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) వరకు రవిశాస్త్రిని టెస్ట్ జట్టు కోచ్‌గా తిరిగి తీసుకురావాలని బీసీసీఐ గట్టిగా ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. రవిశాస్త్రి కోచింగ్‌లో భారత్ టెస్ట్ క్రికెట్‌లో అద్భుత విజయాలు అందుకుంది.…