India Abstains On Russian-Sponsored Resolution Against Ukraine At UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ పై రష్యా ప్రతిపాదించిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. అమెరికా, ఉక్రెయిన్ ల్యాబుల్లో ‘సైనిక జీవసంబంధ కార్యకలాపాలు’ జరుగుతున్నాయని రష్యా ఆరోపిస్తూ.. ఈ తీర్మానాన్ని భద్రతా మండలి ముందుకు తీసుకువచ్చింది. దీన్ని పరిశోధించేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని రష్యా కోరింది. జీవ ఆయుధాల ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని రష్యా ఆరోపించింది