డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలలో 15 రోజులు, రెండు పూటలా రేషన్ సరకుల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి, ఇంటింటికి అందిస్తాం అని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టాం అని, రైస్ స్మగ్లింగ్ అనేది లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పనులు మానుకుని రేషన్ వ్యాన్ కోసం ఎదురు చూసే విధానానికి స్వస్తి పలికామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజల కోసం పని చేస్తున్నాయని చెప్పారు. మార్కెట్‌లో ధరల పెరుగుదల ఉంటే.. సబ్సిడీపై…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేషన్ షాప్‌లో రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో నేడు 17,263 చాకధరల దుకాణాల ద్వారా 2 లక్షల 91 వేలకు పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు సన్నపు బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. ఇంతకుముందు దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో తీసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా బయటే అమ్ముకునే పరిస్థితి లేదంటే చౌక ధరల దుకాణదారుకే…
కేరళ రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు సరైనవి కాదని, వీటి అమలు కష్టమని సీఎం పినరయి విజయన్ తెలిపారు.
Pongal Gift: తమిళనాడు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పొంగల్ గిప్ట్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపు వినియోగదారులకు రూ.1000 నగదు, 1 కేజీ తీపి బియ్యం, 1 కేజీ పంచదార, మొత్తం చెరకు బహుమతి ప్యాకేజీలుగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి రేషన్ దిగుమతి, పంపిణీ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది రేషన్ డీలర్ల సంఘం. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని అలాగే… డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డీలర్ల నుంచి ఐసీడీఎస్‌కు మళ్ళించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు డీలర్లు.2020 మార్చి 29 నుంచి ఇప్పటి వరకు ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్ బకాయిలు చెల్లించాలన్నారు.…