Pinarayi Vijayan: కేరళ రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు సరైనవి కాదని, వీటి అమలు కష్టమని సీఎం పినరయి విజయన్ తెలిపారు. కేరళలో రేషన్ వ్యవస్థ దీర్ఘకాలంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ ప్రభుత్వం నూతన ప్రచార పోకడను చేపట్టడం అభ్యంతరకరమని ఆయన పేర్కొన్నారు.
Read Also: Doctors in Kamareddy: ఎలుకలు పేషెంట్ ని కొరికితే అది వైద్యుల తప్పా..?
ఇక, జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద పని చేస్తున్న రేషన్ పంపిణీ వ్యవస్థను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం సరైంది కాదని కేరళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరాయి విజయ్ కేంద్ర ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రచారం కోసమే మోడీ సర్కార్ ఇలా వ్యవహరిస్తోందనేది ఆయన స్పష్టం చేసిందన్నారు. ఈ తరహా ప్రచారం సరైంది కాదని తన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుందని.. ఇలా చేయడం కష్టమని కూడా వివరిస్తామని సీఎం పినరాయి విజయ్ పేర్కొన్నారు.
Read Also: Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వాయిదా
అయితే, రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని, ఆహారోత్పత్తులతో కూడిన క్యారీ బ్యాగ్‌లపై మోడీ సర్కార్ లోగోలను ముద్రించాలని కూడా ఎఫ్‌సీఐతో పాటు కేరళ ఆహార శాఖకు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసిందని కేరళ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 550 రేషన్ దుకాణాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సెల్ఫీ పాయింట్లను నెలకొల్పాలని కూడా కేంద్ర సర్కార్ ఆదేశించిందని మంత్రి పేర్కొన్నారు.