యూపీలోని హమీర్‌పూర్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచి పారిపోయి ప్రియుడి కోసం వస్తే.. ప్రియురాలిపై యువకుడి తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతకు ముందు.. ప్రియుడు, ప్రియురాలు వీరి పెళ్లి కోసం నకిలీ పత్రాలు తయారు చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రియుడు ఆమెను ఇంటికి తీసుకురాగా.. తండ్రీకొడుకులు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. అయితే.. ఆ ఇద్దరి బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తండ్రీకొడుకులపై…
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేసిన ఉదంతం వెలుగు చూసింది. నలసోపరా ప్రాంతంలో ఓ ప్రైవేట్ ట్యూషన్ క్లాస్‌లో నిందితుడు ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడైన స్కూల్ టీచర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అమిత్ దూబే (30)గా గుర్తించినట్లు తెలిపారు.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి 14 రోజులు పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. బీఎన్ఎస్ సెక్షన్లు 64 (అత్యాచారం), 103 (హత్య) కింద అభియోగాలు నమోదయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాలికను ఓ హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. ఈ ఘటన మొత్తం నిందితుడి స్నేహితులు వీడియో తీశారు. వీడియో తీసిన అనంతరం బాలికను బెదిరించి తన వద్ద నుంచి డబ్బు, ఉంగరం తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
2022లో గిర్ సోమనాథ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 32 ఏళ్ల వ్యక్తికి గుజరాత్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడికి చనిపోయే వరకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌ఐ భోరానియా తీర్పు చెప్పారు. దీంతో పాటు నిందితుడికి రూ.25 వేల జరిమానా కూడా విధించారు
Rape and Cheating Case Filed on Aman Singh: హైదరాబాద్ కు చెందిన నటుడు అమన్ సింగ్ పై రేప్ కేసుతో పాటు చీటింగ్ కేసు నమోదు అయింది. హైదరాబాదు బేగంపేట ప్రాంతానికి చెందిన ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిమ్ లో పరిచయమైన తనను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుసార్లు అత్యాచారం చేసినట్లుగా సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి…
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అమెరికా మహిళపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. పెళ్లయిన ఓ లాయర్ అమెరికాకు చెందిన అమ్మాయితో ఫేస్‌బుక్‌లో స్నేహం చేశాడు. తనకు పెళ్లికాలేదని యువతిని భారత్‌కు రప్పించాడు. జైపూర్, అజ్మీర్ సహా పలు చోట్ల హోటళ్లలో యువతికి సౌకర్యం కల్పించాడు. ఈ క్రమంలో అమెరికా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దానికి ఆ వ్యక్తి అబద్ధపు మాటలు చెబుతూ వచ్చాడని యువతి తెలిపింది.
ముంబైలో ఓ వాచ్‌మన్ అఘాయిత్యానికి తెగబడ్డాడు. బ్రాండ్ మేనేజ్మెంట్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌పై అత్యాచారయత్నానికి పూనుకున్నాడు. మహిళ ఎదురు తిరగడంతో కత్తితో దాడికి యత్నించాడు. అదృష్టం కొద్ది ఆమె ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చేరింది.