Hyderabad Crime: ఫేస్‌బుక్‌లో పరిచయం.. మహిళా కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యువతి యాక్సెప్ట్ చేసింది.. దీంతో యువతకి ప్రేమ పాఠాలు చెప్పాడు.. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. తన ఫోటోలని ఆమెకు పంపించాడు.. చివరికి ఆమె ఇతగాడి ప్రేమని నమ్మి ఫోటోలను పంపింది.. ఫోటోలు వీడియోలు షేరింగ్ తర్వాత పెళ్లి చేసుకుందామని అన్నారు.. దీంతో యువతి ఉప్పెంగిపోయింది.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు.. ఆస్ట్రేలియా, అమెరికా కంపెనీలో ఉద్యోగం చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్పాడు.. యువకుడ్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది.. ఇంకేముంది పెళ్లి చేసుకుందాం రా అని పిలిచాడు.. దీంతో యువతి ఏకంగా చత్తీస్‌గఢ్ లోని రాయపూర్ లోని తన తల్లిదండ్రులను వదిలిపెట్టి ఒంటరిగా హైదరాబాద్ చేరుకుంది ..
Read Also: Israel: ఇజ్రాయిల్ మొస్సాద్ అనుకుంటే “టూత్ పేస్ట్”తో కూడా చంపేస్తుంది.. వాడి హద్దాద్ ఒక ఉదాహరణ..
ఇక, హైదరాబాద్ కు వచ్చిన తర్వాత యువకుడ్ని కాంటాక్ట్ చేసింది.. సికింద్రాబాద్ లోని ఒక ఇంటికి యువతని తీసుకు వెళ్ళాడు ..రెండు రోజులపాటు యువతిని అక్కడ ఇక్కడ తిప్పాడు.. అంతా బాగానే ఉంది.. మూడవరోజు యువతి పైన అత్యాచారం చేశాడు. పలుమార్లు రేప్ చేసిన తర్వాత యువకుడు కనిపించకుండా పోయాడు.. తాను మోసపోయానని గ్రహించింది.. దీంతో వెంటనే తిరిగి తన సొంత గ్రామానికి వెళ్ళిపోయింది .. రాయపూర్ కి వెళ్లిపోయి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీంతో పోలీసులు సికింద్రాబాద్ చెందిన స్వామి పైన కేసు నమోదు చేశారు.. ఆ కేసుని సికింద్రాబాద్‌లోని మహంకాళి పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు.. తనపై కేసు నమోదు అయిందని విషయం తెలుసుకున్న స్వామి వెంటనే హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు.. అప్పటికే కేసు నమోదు చేసి స్వామి కోసం వెతుకుతున్న పోలీసులకు అతను ఎయిర్ పోర్ట్ ద్వారా పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిసింది.. అప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ చేసి విమానం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాడు.. విమానాశ్రయంలోని ఎఫ్ ఆర్ ఆర్ ఓ తో పాటు ఎయిర్ పోర్ట్ అధికారులు సీఐఎస్ఎఫ్ అధికారుల సహకారంతో యువకుని విమానం ఎక్కుతుండగా సికింద్రాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
Read Also: AP CM Chandrababu: మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఇసుక లభ్యత, ధరలపై కీలక చర్చ
ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతికి హైదరాబాద్‌లో ఉంటున్న స్వామి అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు నమ్మించిన స్వామి.. ఆమెను హైదరాబాద్‌కు రప్పించాడు.పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి అడగడంతో ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నించగా.. అతడి ప్రవర్తన పట్ల అనుమానం వచ్చిన యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని.. ఇలాంటి వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.