బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళపై తన స్నేహితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా.. తనకు మత్తు మందు ఇచ్చి.. అత్యాచారం చేసిన ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తుున్నాడని బాధితురాలు సోమవారం పోలీసులకు తెలిపింది.
నార్వే యువరాణి మెట్టే మారిట్ పెద్ద కుమారుడు మారియస్ బోర్గ్ హోయిబీ(27) అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. రేప్ కేసులో హోయిబీని సోమవారం ఓస్లోలో పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారంపై ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. వడమాల పేట మండలం ఎఎంపురం గ్రామ చిన్నారి హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలుపుతూ.. రూ.10 లక్షలను బాధిత కుటుంబానికి అందచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను ఆదేశించారు సీఎం చంద్రబాబు.
వికారాబాద్ జిల్లా దోమ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి మైనర్ బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా.. ఈ ఘటనపై దోమ పోలీసు స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌లో దారుణం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమై ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఇన్‌స్టాలో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (మం) జివంగి గ్రామానికి చెందిన చెందిన వినీల్ (19), న్యాల్కల్‌కి చెందిన ఓ బాలిక(16) పరిచయం ఏర్పడింది. ఏడు నెలలుగా ప్రేమ పేరుతో ఇన్‌స్టాలో బాలికతో చాటింగ్, కాల్స్ చేశాడు. కాగా.. ఇటీవల యువకుడు బాలిక గ్రామానికి వచ్చి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మరో అత్యాచార ఘటన జరిగింది. కమలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాఠశాల ఉపాధ్యాయుడు మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం.. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన బాలిక ప్రైవేట్ పార్ట్‌లపై గాయాలు చూసి బాలిక తల్లి ఒక్కసారి షాక్ అయింది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు బలవంతంగా మద్యం తాగించి రోడ్డు పక్కన అత్యాచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో బుధవారం సాయంత్రం నాటిదని చెబుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యం కనిపిస్తోంది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. అనంతరం న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరిగాయి. పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే ఈ ఘటన తర్వాత నిందితుడు సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేసినా.. అన్ని వేళ్లు మాత్రం ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వైపే చూపించాయి.
పొలాల్లోకి తీసుకెళ్లి ఓ యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన యూపీలోని హమీర్పూర్ జిల్లాలో జరిగింది. రాత్ గ్రామంలో ముగ్గురు యువకులు బాలికను బైక్పై బలవంతంగా పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, అనంతరం ఆ యువతిని వదిలేసి పారిపోయారు.