ఇండియన్ ఐకానిక్ డైరెక్టర్ శంకర్ ‘అపరిచితుడు’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ ‘అపరిచితుడు’ రీమేక్ లో హీరోగా నటించనున్నారు. పెన్ మూవీస్ బ్యానర్ పై జయంతిలాల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నారు. తమిళంలో ‘అన్నియన్’గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘అపరిచితుడు’ పేరుతో విడుదలైంది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సృష్టించిన సునామీ అంతా…