Gotabaya Rajapaksa To Seek Temporary Stay In Thailand: శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అయిన మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స మరో దేశం ఆశ్రయం కోరాడు. గత నెలలో శ్రీలంక వ్యాప్తంగా ప్రజానిరసనలు మిన్నంటాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స శ్రీలంకను వదిలి ఆర్మీ విమానంలో మాల్దీవులకు పారిపోయాడు. అయితే అక్కడ కూడా శ్రీలంక ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో జూలై 14న సింగపూర్ దేశానికి పారిపోయాడు. అప్పటి నుంచి…
Sri Lankan President thanks PM Modi: గత కొంత కాలంగా చైనాతో రాసుకుపూసుకు తిరిగిన శ్రీలంకకు భారత్ విలువ తెలుస్తోంది. రాజపక్సల హయాంలో భారత్ ను కాదని.. చైనాతో వ్యాపారం చేసి, భారీగా అప్పులు చేసిన శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోెభాన్ని ఎదుర్కొంటోంది. చైనా అప్పులు తీర్చలేక హంబన్ టోటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ కు ఇస్తామన్న ప్రాజెక్టులను కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసిన చరిత్ర రాజపక్సలది.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. ప్రజల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో గత శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అబేవర్థనకు పంపాడు. తాజాగా సంక్షోభం నేపథ్యంలో శనివారం శ్రీలంక పార్లమెంట్ సమావేశం అయింది. గొటబాయ రాజపక్స రాజనీమా లేఖను పార్లమెంటరీ సెక్రటరీ జనరల్ ధమ్మిక దసనాయకే చదివి వినిపించారు. ‘‘శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక…