ఓ లారీ డ్రైవర్ పై కారులో వచ్చిన డుండగులు కాల్పులు జరిపిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కలకలం రేపింది. శనివారం (నిన్న) రాత్రి లారీని వెంబడిస్తూ వచ్చిన ఓ వ్యక్తి తుక్కుగూడ ఎగ్జిట్ 14 వద్ద రాగానే సడెన్ గా లారీడ్రైవర్ పై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే.. గురి తప్పడంతో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. తుపాకీ కాల్చడంతో.. లారీ అద్దాలు పగిలిపోయాయి. అప్రమత్తమైన లారీ డ్రైవర్ మనోజ్…
కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు సిటీ చుట్టుపక్కల ఉన్న సబర్బన్ ప్రాంతాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ ఏరియాల్లో బీజేపీకి చెక్ పెట్టడంతోపాటు పార్టీకి పునర్వైభవం తేవటమే లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 శాసన సభ నియోజకవర్గాలు ఉండగా 2018 ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎలక్షన్లలో సైతం 150 వార్డులకు గాను నామమాత్రంగా రెండు చోట్లే నెగ్గింది. మూడో వార్డును ఉపఎన్నికలో…
మంత్రి సబితా ఇలాకాలోనే టీఆర్ఎస్ లో చెలరేగిన రాజకీయ దుమారం కాంగ్రెస్ నేతల రంగల ప్రవేశంలో ఎలాంటి మలుుపు తీసుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది. ఈనేపథ్యంలో త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వారి జాబితా ఇదే నంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో తీగల కృష్ణారెడ్డి పేరు కూడా ఉండటం గమనార్హం. తాను పార్టీ మారే ఉద్దేశంలో లేను అని ప్రకటించినప్పటికీ ఈనెల 11న కాంగ్రెస్ కండువా కప్పుకోవాడానికి తీగల ముహూర్తం…
రంగారెడ్డి జిల్లాలో చేపలు వృధాగా పారవేయడం కలకలం రేపింది. మార్గశిర మాసం మొదలవడంతో.. చేపల కోసం మార్కెట్లకు ప్రజలు క్యూకట్టారు. దీంతో చేపలకు విపరీతంగా గిరాకీ పెరిగింది. ఎక్కువ రేటు వున్నాకూడా వినియోగదారుడు చేపలు కొనడానికి వెనుకంజ వేయలేదు. అయితే అది నిన్నటి మాట. రంగారెడ్డిజిల్లా జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతంలో నిర్వాహకులు చేపలను వృధాగా పడేయడం కలకలం రేపుతోంది. గంగపుత్ర సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది నిర్వహించే చేప…
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో రౌడీ షీటర్లు మరోసారి రెచ్చిపోయారు. అత్తాపూర్ ఎన్. ఎమ్ గూడ వద్ద మగ్దూమ్ అనే యువకుడిపై కత్తి తో దాడి చేశారు. యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో .. హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వివరాల్లో వెళితే.. మగ్దూమ్ వద్దకు వెళ్ళిన రౌడీ షీటర్లు రహ్మత్, రహమాన్ లు.. నీతో మాట్లాడాలని ఎన్. ఎమ్ గూడ వద్ద కు పిలిపించారు. ఓ అమ్మాయి విషయంలో వీరి ముగ్గురి మద్య ఘర్షణ వాతావరణం…
కుటుంబం కోసం అప్పులు చేయడం అది తీర్చలేక ప్రాణాలమీదకు తెచ్చుకోవడం. ఏపని చేసిన, ఎంత శ్రమించిన అప్పుల పెరుగుతూనే వుంటాయి తప్పాతరగడంలేదని భావించి చివరకు ఆత్మహత్యలకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. నేను పోతే నాకుటుంబం పై భారం పడుతుందేమో అనుకున్నాడో ఏమో ఆతండ్రి చిన్నపిల్లలు అని కూడా చూడకుండా.. ఇద్దరు కుమార్తెలతో కలిసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. రంగారెడ్డి జిల్లా కుర్మల్ గూడలో విషాదం నెలకొంది. ఆదిబట్ల పరిధిలోని…
భాగ్యనగరంలో భారీగా పెరిగిన మద్యం ధరలు మద్యం ప్రియులకు తలనొప్పిగా మారాయి. అమాంతంగా పెరిగిన ధరల దృష్ట్యా లిక్కర్ వినియోగం కొంత వరకు తగ్గింది. కానీ.. ఆబ్కారీ శాఖ ఆదాయం మాత్రం పెరిందనే చెప్పాలి. అన్ని రకాల బీర్లు, మద్యం బ్రాండ్ లపైన ప్రభుత్వం కనిష్టంగా రూ. 20 నుంచి గరిష్టంగా సుమారు రూ. 160 వరకు ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఒక్కో బ్రాండ్ ధర ఒక్కోవిధంగా పెరిగింది. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన…
అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని సార్లు చెప్పినా… రోడ్డు ప్రయాణాల్లో వాహనదారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ అమాయక ప్రజల మరణాలకు కారణం అవుతున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి, రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. కనీసం సివిక్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. రోడ్డు నియమ నిబంధనల గురించి అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు. అధికారులు రోడ్డు నిబంధన గురించి అవగాహన కల్పిస్తున్నా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి అప్పా దగ్గర రోడ్డు ప్రమాదానికి కూడా కారణం…
ఈమధ్యకాలంలో కోర్టుల్లోనూ, కోర్టుల బయట తుపాకులు, కత్తులతో కొందరు తిరుగుతున్నారు. తాజాగా రంగారెడ్డి కోర్టుల దగ్గర ఇలాంటి ఘటనే జరిగింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా కోర్టు లోకి కత్తితో ప్రవేశించాలని చూసిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయి కిరణ్ అతని మిత్రుడిని అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్ పోలీసులకి అప్పగించారు కోర్టు సెక్యూరిటీ సిబ్బంది. గత సంవత్సరం మియాపూర్ కి చెందిన ఒక యువతి తన క్లాస్ మేట్ మైనారిటీ యువకుడు…