Telangana: రేటు పెరిగింది.. ‘కిక్కు’ తగ్గింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగరంలో భారీగా పెరిగిన మద్యం ధరలు మద్యం ప్రియులకు తలనొప్పిగా మారాయి. అమాంతంగా పెరిగిన ధరల దృష్ట్యా లిక్కర్ వినియోగం కొంత వరకు తగ్గింది. కానీ.. ఆబ్కారీ శాఖ ఆదాయం మాత్రం పెరిందనే చెప్పాలి. అన్ని రకాల బీర్లు, మద్యం బ్రాండ్ లపైన ప్రభుత్వం కనిష్టంగా రూ. 20 నుంచి గరిష్టంగా సుమారు రూ. 160 వరకు ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఒక్కో బ్రాండ్ ధర ఒక్కోవిధంగా పెరిగింది. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన మద్యం ప్రియులపైన ధరల భారం పడిందనే చెప్పాలి.
అనూహ్యంగా పెరిగిన ధరలు నిరాశకు గురిచేశాయి. ధరల పెంపునకు ముందు రోజు అమ్మకాలను నిలిపివేశారు. ఆ తరువాత కొత్త ధరలతో అమ్మకాలు మొదలయ్యాయి. ధరల పెంపునకు ముందు రంగారెడ్డి జిల్లాలో సుమారు 4 లక్షల కేసుల బీర్లు విక్రయించగా ధరల పెంపు తరువాత ఈ నెల 19 నుంచి 28 వరకు 3.6 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
Also Read
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
- Off The Record: ఒకే పార్టీకి రెండు ఆఫీసులా..? అక్కడ బీజేపీలో పీక్స్‌కు చేరిన గ్రూప్ వార్..!
సుమారు 40 వేల కేసుల వరకు బీర్ల అమ్మకాలు పడిపోయాయి. గ్రేటర్‌లో అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగే రంగారెడ్డి జిల్లాలో ధరల పెంపునకు ముందు 1.86 లక్షల కేసుల ఐఎంఎల్ మద్యం విక్రయిస్తే ధరలు పెరిగిన తరువాత 1.84 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి.
సుమా రు 20 వేల కేసులు తగ్గుముఖం పట్టాయి. అలాగే హైదరాబాద్, మేడ్చెల్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలోనూ ధరల పెంపునకు ముందు, తరువాత లిక్క ర్ అమ్మకాల్లో వ్యత్యాసం స్పష్టంగా నమోదైంది. పెరిగిన ధరల దృష్ట్యా మద్యం వినియోగం కొంత మేరకు తగ్గిందని పలు వైన్‌షాపులకు చెందిన నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. వేసవి ఇంకా నిప్పులు చెరుగుతున్నప్పటికీ బీర్ల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టడం గమనార్హం.
బీరుపైన పెరిగిన ధరలు స్వల్పమే అయినా గత వారం కంటే వినియోగం తగ్గింది. మేడ్చల్ జిల్లా పరిధిలో ఈ నెల మొదటి పది రోజుల్లో 85 వేల కేసుల బీర్లు విక్రయిస్తే ఈ నెల 19 నుంచి 28 వరకు 80 వేల కేసుల బీర్లు అమ్మారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
లిక్కర్ ధరలు పెంచడంతో అమ్మకాలు తగ్గినా ఆదాయం మాత్రం కొద్దిగా పెరిగింది. ఈ నెల 8వ తేదీ నుంచి 17 వరకు గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో రూ.315 కోట్ల ఆదాయం నమోదు కాగా, 19వ తేదీ నుంచి 28 వరకు రూ.351 కోట్లకు ఆదాయం పెరిగింది. మూడు జిల్లాల్లోనూ రంగారెడ్డి టాప్‌లో ఉంది. ధరల పెంపునకు ముందు రూ.192 కోట్ల ఆదాయం లభించగా, ప్రస్తుతం రూ.212 కోట్లకు పెరిగింది.
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!