Gun Firing in Rangareddy: రంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం.. కారులో వచ్చి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ లారీ డ్రైవర్ పై కారులో వచ్చిన డుండగులు కాల్పులు జరిపిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కలకలం రేపింది. శనివారం (నిన్న) రాత్రి లారీని వెంబడిస్తూ వచ్చిన ఓ వ్యక్తి తుక్కుగూడ ఎగ్జిట్ 14 వద్ద రాగానే సడెన్ గా లారీడ్రైవర్ పై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే.. గురి తప్పడంతో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. తుపాకీ కాల్చడంతో.. లారీ అద్దాలు పగిలిపోయాయి. అప్రమత్తమైన లారీ డ్రైవర్ మనోజ్ వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు. కాగా.. ఈ లారీలో ఐరన్ లోడ్ తో మెదక్ నుంచి కేరళలోని కొచ్చికి బయల్దేరినట్లు బాధితుడు మనోజ్ కంప్లైంట్ తెలిపాడు. ఈనేపథ్యంలో.. కాల్పుల ఘటన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. దుండగులు కాల్పుల అనంతరం నిందితుడు వరంగల్ వైపు వెళ్లి పరారై ఉండవచ్చని భావిస్తున్నారు.
అయితే .. గతంలోకూడా ఔటర్ రింగ్ రోడ్డు పై తమిళనాడు, మధ్యప్రదేశ్ , ఉత్తర్ ప్రదేశ్ లకు చెందిన దోపిడీ దొంగలు హల్ చల్ చేసినవిషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. విలువైన వస్తువులు రవాణా చేసే లారీలు, కంటైనర్లను లక్ష్యంగా దోపిడీ దొంగలు టార్గ్‌ట్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లాడీ డ్రైవర్లను బెదిరించటం.. లేదంటే హతమార్చటం చేస్తున్నారు. అయితే.. గత కొద్దిరోజుల క్రితం లారీ టైర్లు, సబ్బులతో వెళ్తున్న లారీలను అడ్డగించి దోచుకున్న ముఠాలను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
తాజావార్తలు
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!