రోడ్లపై రక్తదాహం కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం కుటుంబంలో విషాదం నింపింది. కొత్తూరు పరిధిలోని తిమ్మాపూర్ శివారులో లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అన్నాచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట్ మండలం కొమ్మిరెడ్డిపల్లికి చెందిన చంద్రశేఖర్… హైదరాబాద్ జీడిమెట్లలో ఉంటున్నారు. వనపర్తి జిల్లాలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి సోదరి మమతతో కలిసి వెళ్ళారు చంద్రశేఖర్. అక్కడినించి తిరిగి హైదరాబాద్ వస్తుండగా లారీ రూపంలో విధి వెంటాడింది. కొత్తూరు మీదుగా బైక్‌పై వేగంగా…
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాబోయే భర్తే కదా అని నమ్మిన ఆ యువతిని ఆ నీచుడు నట్టేట ముంచాడు. డబ్బు కోసం కాబోయే భార్య నగ్న వీడియోలనే ఎరగా వేశాడు. దీంతో తట్టుకోలేని ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వివరాలలోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్ గ్రామానికి చెందిన జుట్టు రామ్ కార్తీక్ అలియాస్ రమేశ్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఏడాది క్రితం మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ప్రగతితో…
ప్రభుత్వం పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన సూచనలు, ప్రతిపాదనలకు సంబంధించి ఒక కమిటీ వేశారు. ఆయా జిల్లాలకు సంబంధించి మంత్రుల ఆధ్వర్యంలో ఈ కమిటీ అఖిల పక్షం సూచనలు తీసుకుంటుంది. దాని అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మంత్రి సబిత ఇంద్రారెడ్డి శనివారం అఖిలపక్ష నాయకులతో సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ కమిటీ వేశారన్నారు.…
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు స్కూల్ బస్సులపై రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా ఏడాదిన్నర తర్వాత విద్య సంస్థలు తెరుచుకున్న విషయం తెలిసిందే. ఆ కారణంగా విద్యార్ధులను తరలించే బస్సుల పై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. నార్సింగీ, కొండాపూర్, చేవెళ్ళతో పాటు శంషాబాద్ లో తనిఖీలు నిర్వహిస్తుంది అధికారుల బృందం. అయితే నిన్న 12 బస్సులను సీజ్ చేసిన అధికారులు నేడు నిబంధనలు పాటించని మరో స్కూల్ 15 బస్సులను…
హైదరాబాద్ శివార్లలోని చేవెళ్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. మృత్యువులోనూ వీడని స్నేహబంధం ఆ మిత్రుల ఆనందాన్ని చూసి.. విధికి కన్ను కుట్టిందో ఏమో.. అప్పటి దాకా ఆనందోత్సాహాలతో గడిపిన ముగ్గురు మిత్రులు అంతలోనే విగత జీవులయ్యారు. ఫ్రెండ్ బర్త్ డే కు కేక్ కోసమని. .బైక్…
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లిలో ఉద్రిక్త నెలకొంది… అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ టవర్లను కూల్చివేశారు స్థానికులు.. నిన్న పోలీస్ బందోబస్తు మధ్య 33 కేవీ విద్యుత్ టవర్లను ఏర్పాటు చేశారు అధికారులు.. అయితే, ఇవాళ పెద్ద ఎత్తున తరలివచ్చిన తక్కళ్లపల్లి గ్రామస్తులు, మహిళలు… ఆ టవర్లను కూల్చివేశారు.. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. కాగా.. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని అమెజాన్ సంస్థ కోసం విద్యుత్ టవర్లు ఏర్పాటు చేశారు.. తక్కళ్లపల్లి పవర్‌ప్లాంట్ నుంచి అమెజాన్…
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మూడేళ్లుగా ఓ యువకుడిని ప్రేమించింది. కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచిపెట్టి పెళ్లికి సిద్దమయింది. ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేందుకు సిద్దమైనపుడు కూడా ఎవరికి చెప్పలేదు. పెళ్లి సమయంలో ఆ యువతి ప్రేమించిన యువకుడితో చాటింగ్ చేసింది. పెళ్లిపీటలమీద నుంచి కూడా యువతి చాటింగ్ చేయడంతో అనుమానం వచ్చిన బంధువులు యువతి మొబైల్‌ఫోన్‌ను, పెళ్లి పందిరిలో అనుమానంగా కనిపించిన యువకుడిని పట్టుకున్నారు. యువకుడికి దేహశుద్ధి…