ప్రేమించని వెంటతిరిగాడు ఆమె అతని ప్రేమకు నిరాకరించింది. అయితే అంతటితో ఆగక మళ్లీ పెళ్లిచేసుకోవాలని వేధించాడు. దానికి కూడా ఆ యువతి ససేమిరా అనడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఈదారుణం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. హిమాయత్ సాగర్ సౌడమ్మ దేవాలయంలోకి ఓ దొంగల ముఠా చొరబడి అమ్మవారి హుండీని పగలగొట్టడానికి విఫలయత్నం చేసింది.
దొంగల ముఠా హల్ చల్ సృష్టిస్తున్నాయి. తాళాలు వున్న ఇల్లకే టార్గెట్ చేస్తూ దొంగ తనాలకు పాల్పడుతున్నారు. నిన్నటి వరకు నగరంలో చెడ్డిగ్యాంగ్ హడల్ ఎత్తించిన విషయం తెలిసిందే. దాంతో నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తాళం వేసిన ఇల్లకే కాదు తాళవేయకున్నా వారిఇంటికి టార్గెట్ చేస్తే అది దోచుకోవాల్సిందే అన్నట్లుగా చెడ్డి గ్యాంగ్ వ్యవహారం వుండేది. ఇది పోలీసులకు సవాల్ విసిరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెడ్డీగ్యాంగ్ ఆగడాలను అరికట్టారు. దీంతో దొంగల…
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలు అందిస్తూ ట్రాక్టర్, కారు నడిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ గ్రౌండ్ లో జరిగిన యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ సుధీర్ రెడ్డి, జడ్పీ…
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ ఆస్పత్రిలో రాఘవేందర్ రెడ్డి చికిత్స అందుకుంటూ మరణించాడు. ఈ కాల్పుల కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై గతం లో పలు మార్లు రాచకొండ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తమ భూమిని కబ్జా చేస్తున్నారని రాచకొండ పోలిసులను కలిశారు లేక్…
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి… ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ పరిస్థితి విషమంగా ఉంది… ఈ ఘటనకు భూ వివాదమే కారణంగా చెబుతున్నారు.. ఇటీవలే 10 ఎకరాల భూమిని ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి అనే ఇద్దరు రియల్టర్లు.. అయితే, అప్పటికే ఆ భూమిపై కబ్జాలో ఉన్నాడు మట్టారెడ్డి అనే వ్యక్తి..…
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లక్షలాదిమంది భక్తుల రాకతో పులకించింది. అక్కడ ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహం కనులవిందుగా కనిపించింది. శ్రీరామనుజుల కీర్తి దశదిశలా మరోమారు వ్యాపించింది. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీరామనగరంలో 12 రోజుల పాటు జరిగిన మహా క్రతువులో వేలాది మంది రుత్వికులు.. లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అంకురార్పణ నుంచి మహా పూర్ణాహుతి వరకు నిత్యం ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. భారత దేశానికి చెందిన అతిరథ మహారథులు, రాజకీయ ప్రముఖులు సమతామూర్తిని…
తెలంగాణ 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల లోపు టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ అందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు హన్మకొండలో 103 శాతం మేర వ్యాక్సినేషన్ జరగ్గా… రంగారెడ్డి జిల్లా 51 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లాలో 1,77,102 మంది 15 నుంచి 17 ఏళ్ల లోపువారుండగా.. కేవలం 90,046 మందికే ఇప్పటిదాకా కరోనా వ్యాక్సిన్ వేశారు. అటు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కవరేజీ 70 శాతం లోపే ఉంది. Read…
కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి.. కన్న కూతురిపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువరించింది ఎల్బీ నగర్ కోర్టు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్టేషన్ పరిధిలో 2018లో కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడాడో కిరాతకుడు.. అయితే, ఈ కేసులో ఇవాళ తీర్పు వెలువరించింది ఎల్బీ నగర్ కోర్టులు.. నిందితుడికి 15 సంవత్సరాల జైలుతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.. ఇక, 2018లో ఈ కేసు వెలుగు చూడగా..…