Love Harassment: పెళ్లికి నిరాకరించిన మరదలు.. కత్తితో దాడిచేసిన అక్కమొగుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Harassment: రంగారెడ్డి జిల్లా కేశంపేటలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ, పెళ్లి పేరుతో మరదలిపై అక్కమొగుడు కత్తితో దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన అనిత రోజూలాగే తన విధులు నిర్వహించేందుకు ఆఫీసుకు వెళ్లింది. అయితే స్టాఫ్ నర్స్ కావడంతో అక్కడే నిద్రించింది. ఇదే అలుసుగా భావించిన అక్క మొగుడు అనిల్ (వరుసకు బావ) కేశంపేటకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. ఆమె నిద్రిస్తుండటంతో ఆమెపై దాడి చేశాడు. తనతో తెచ్చుకున్న కత్తితో మెడ, చేతి మణికట్టు కోసి తీవ్రంగా గాయపరిచాడు. అయితే అనిత గట్టిగా అరవడంతో తోటి సిబ్బంది గమనించి అతనిని తోసేయ్యడంతో అనిల్ దుండగుడు పారిపోయాడు. తీవ్ర రక్తం మడుగులో ఉన్న అనితను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
అయితే స్థానిక సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అక్క భర్త వేధిస్తూ తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే మిమ్మల్ని రోడ్డుపైకి తెస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొంది అనిత. ఎవరిని పెళ్లి చేసుకొనివ్వనని, కొన్నాళ్లుగా వత్తిడి చేస్తున్నాడని తెలిపింది. పెళ్లికి తిరస్కరించడంతో ఈ రోజు ఆసుపత్రిలో డ్యూటీ లో ఉన్న అనిత పై కత్తి తో దాడి చేసి హత్యా యత్నం చేసాడని బాధితురాలు వివరించింది. అనితపై దాడి చేసింది అనిత అక్క భర్త కిషన్ అని ,నితకు వరుసకు బావ అవుతాడని తెలిపింది. తనను పెళ్లి చేసుకోవాలని వేధించాడని అయితే పెళ్లికి నిరాకరించడంతో తనపై బావ కిషన్ దాడి చేశాడని వాపోయింది. కొద్దిరోజులుగా ప్రేమించమని వేధించాడని తను ఒప్పుకోలేదని, ఆతరువాత పెళ్లి చేసుకోమని వేధించాడని పోలీసులకు తెలిపింది. అయితే తన బావ వల్ల తనకు ప్రాణమాని ఉందని తనను కాపాడాలని కోరింది. తను ఉద్యోగం చేస్తున్నదగ్గరే వచ్చే ఇలాంటి ఘాతుకానికి పాల్పడతాడని ఊహించలేదని భయంగా ఉందని అనిత చెప్పుకొచ్చింది.
Pakistan: ఇస్లామాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. 300 దుకాణాలు దగ్ధం..
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!