రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. రాజు అనే బార్బర్‌ను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు కొందరు దుండగులు. హత్య జరిగిన వెంటనే స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
Rangareddy Crime: షాద్ నగర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమెపై పోలీసులు సమగ్ర విచారణకు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Rangareddy Crime: బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో అనుమానితులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు మహిళ అని చూడకుండా దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధుల తీరు మారడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా మారింది. కన్న బిడ్డలను కాపాడుకోవడం తల్లిదండ్రులకు కత్తిమీద సాములాగా మారింది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెత్తుల్లా గ్రామంలో జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో భారీ పేలుడు సంభవించింది. స్థానిక సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి.
Rangareddy Crime: రంగారెడ్డి జిల్లాలో ఓ డిగ్రీ విద్యార్థిని ఉరివేసుకొని మృతి చెందింది. అయితే అది ఆత్మహత్య? లేక హత్య? అన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు.
వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆమె వద్దనే 2.5 లక్షల అప్పు తీసుకున్న ఓ వ్యక్తి.. అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27 మహిళా అదృశ్యం కేసు నమోదు కాగా.. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఎట్టకేలకు నిందితుడు తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
రైతు బజార్ పేరిట భారీ అవినీతికి తెరలేపారు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ కొంత మంది కౌన్సిలర్లు. నార్సింగ్ మున్సిపాలిటీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ప్రతి ఏడాది నిర్వహించవలసిన వేలంపాటను నిర్వహించకుండా నార్సింగ్ మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారు.
చెరువు కబ్జాలపై రంగారెడ్డి కలెక్టర్ సీరియస్ అయ్యారు. గండిపేట, నెక్నామ్ పూర్లోని ఇబ్రహీం చెరువులో బఫర్ జోన్లో నిర్మిస్తున్న విల్లాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు.