Fire Accident: రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం
- రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో పెను విషాదం
- సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి
- ఈ ఘటనలో 30 మందికి పైగా గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో భారీ పేలుడు సంభవించింది. స్థానిక సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయాలు కాగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన జరిగిన సమయంలో కంపెనీలో 150 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు తెలిసింది.
Read Also: Jagga Reddy: రానున్న పదేళ్లలో పీసీపీ అవుతా.. సీఎం కూడా అవుతా..
Also Read
ఫ్యాక్టరీలో గ్యాస్ కంప్రెష్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. మృతులు ఒడిశా, బీహార్ యూపీ వాసులుగా గుర్తించారు. పేలుడు ధాటికి కంపెనీకి చెందిన షెడ్ కుప్పకూలింది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. బాధితులకు గాజు ముక్కలు కుచ్చుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే విషయంపై ఇంకా ఆరా తీస్తున్నారు.
అధికారులను అప్రమత్తం చేసిన సీఎం
షాద్ నగర్ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు.
ప్రమాద స్థలిలోనే ఉన్న కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, కార్మిక, పరిశ్రమలు, వైద్య బృందాలు ఘటనా స్థలిలోనే ఉండి సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!