Rangareddy Crime: దొంగతనం చేసిందనే అనుమానం.. మహిళను చితకబాదిన పోలీసులు
- దొంగతనం చేసిందనే అనుమానం..
- దళిత మహిళను చితకబాదిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy Crime: బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో అనుమానితులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు మహిళ అని చూడకుండా దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.
గత నెల 24వ తేదీన షాద్ నగర్ పట్టణం లోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతుల ఇంటి పక్కన నివాసం ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై దొంగతనం చేశారని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, భీమయ్య తో పాటు వారి 13 ఏళ్ళ కుమారుడు జగదీష్ నీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారు. మైనర్ బాలుడు జగదీష్ ను కూడా చిత్రహింసల గురి చేశారు పోలీసులు. డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి అతని సిబ్బంది బాధితురాలు సునీత ను కుమారుడి ముందే విచక్షణ రహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సీఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయానని తెలిపింది. దీంతో ఇంటికి పంపించారని బాధితురాలు వాపోతోంది. 24 తులాల బంగారం, 2 లక్షల నగదుకు గానూ కేవలం ఒక తులం బంగారం, నాలుగు వేల నగదు రికవరీ చేశామని పోలీసులు చెబుతున్నారు. మహిళ పై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా రిమాండ్ చెయకపోవడం గమనార్హం. అంతే కాకుండా.. ఇంటికి పంపించి వేయడం.. వెనుక పోలీసులు కొట్టిన దెబ్బలకు మహిళ గాయపడటమే కారణంగా తెలుస్తుంది. ఒక వేళ నిజంగా దొంగతనం చేస్తే రిమాండ్ తరలించాలి గానీ.. ఒక పేద మహిళ పై విచక్షణ రహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Wayanad Landslides : చిద్రమైన ముఖాలు.. పాదాలను చూసి అంచనా వేయాల్సిన దుస్థితి.. వయనాడ్ విషాదం
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!