Hydra : హైడ్రాకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఆఫీసుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ఆన్ లైన్ లో కూడా భారీగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు వేగంగా పనిచేస్తున్నామని రంగనాథ్ వివరించారు. హైడ్రా అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారనేదానిపై కమిషనర్ రంగనాథ్ బుధవారం ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని విధాలుగా తాము ప్రజలకు సహకరిస్తున్నామని.. ప్రభుత్వ భూముల్లో ఎవరు బిల్డింగులు కట్టినా విడిచిపెట్టేది లేదన్నారు.…
పోచారంలో హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. కూల్చివేతల అనంతరం ప్రకటన విడుదల చేశారు. “దీప్తి శ్రీనగర్‌లోని 200 ఎకరాల్లో లే అవుట్ ను నల్ల మల్లారెడ్డి డెవలప్ చేశారు. లే అవుట్ లో 2,200 ప్లాట్లను సింగరేణి ఎంప్లాయీస్ తో పాటు ప్రైవేట్ వ్యక్తులు కొన్నారు. లే అవుట్ ఒప్పందం ప్రకారం నల్ల మల్లారెడ్డి రోడ్లు, డ్రైనేజ్ డెవలప్ చేయాలి. కానీ సెక్యూరిటీ పేరుతో 200 ఎకరాల లే అవుట్ చుట్టూ ఎత్తైన…
మాదాపూర్ దుర్గం చెరువు కాలనీవాసులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా.. నాలుగు నెలల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా నిర్మాణాలు వచ్చాయంటూ చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది.
Hydra Commissioner: కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పాటు తర్వాత అక్రమంగా నిర్మించిన ఇండ్ల పై చర్యలు తప్పవనీ స్పష్టం చేశారు.
HYDRA : హైడ్రా (హైదరాబాద్ డెవలప్‌మెంట్ అండ్ రిసోర్స్ అథారిటీ) పబ్లిక్ ఆస్తుల పరిరక్షణలో పౌరులను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో ఒక ముఖ్యమైన కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆక్రమణలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హైడ్రా చీఫ్ రంగనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం బుద్ధ భవన్‌లో ఫిర్యాదులను స్వీకరించనున్నారు. Hebah Patel: పింక్ చీరలో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్ ప్రభుత్వ భూములు, సరస్సులు, కాలువలు, ఉద్యానవనాలపై…
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నగరంలో చెరువులను, కాలువలను, ఫుట్‌పాత్‌లను, ప్రభుత్వ స్థలాలను కాపాడుతూ.. నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన హైడ్రాకు నేటితో వందరోజులు పూర్తి చేసుకుందని ఆయన తెలిపారు.
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. చెరువులు, నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యమని వెల్లడించారు. ఆర్టికల్ 21 ప్రకారం.. పరిశుభ్రమైన వాతావరణం రైట్ టూ లైఫ్ ఉద్దేశమన్నారు. హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎసెట్ ప్రొటెస్ట్ ఉద్దేశ్యం.. వాటి పరిరక్షణ మా బాధ్యత అని పేర్కొన్నారు. నదులు, చెరువులు, నాలాలు ప్రజల ఆస్తులేనన్నారు. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు.