AV Ranganath: హైడ్రా పేరువింటే చాలు.. తెలంగాణలోని స్థానిక ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఎప్పుడు హైడ్రా అధికారులు వస్తారో.. వారు ఉంటున్న నివాసాలను కూల్చేస్తారో అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. స్థానికులకు క్లారిటీ ఇచ్చేందుకు ఇవాళ అంబర్ పేట్ లోని బతుకమ్మ కుంటకు వెళ్లారు. రంగనాథ్ ను చూసిన స్థానిక ప్రజలు ఆందోళన చెందారు. దీంతో ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజల్లో కుల్చివేతలు ఉంటాయనే అపోహ ఉంది.. ఆ అపోహలు తొలగించేందుకే బతుకమ్మకుంటకు వచ్చానని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. రెండు నెలల్లో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. బతుకమ్మకుంట ప్రాంతంలో ఉన్న ఇండ్ల కూల్చివేతలు ఉండవన్నారు. బతుకమ్మకుంటను పునరుద్దరిస్తామన్నారు. ప్రస్తుతమున్న ఐదెకరాల విస్తీర్ణంలోనే పునరుద్దణ చేస్తామన్నారు. బతుకమ్మకుంటలోకి వరద నీరు వచ్చే మార్గాలపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తామన్నారు. హైడ్రా నోటీసులు ఇచ్చే అధికారం ఉందని, హైడ్రా నోటీసులు ఆక్రమణదారులకు వెళ్తూనే ఉంటాయన్నారు. నాగారంలో రోడ్డు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను ఈరోజు కూల్చేశామన్నారు. ఐదు కాలనీలకు వెళ్ళే రొడ్డును ఆక్రమించారని క్లారిటీ ఇచ్చారు. మాకు స్థానికులు కంప్లెయింట్ చేయడంతో సర్వే చేశామన్నారు. 15 ఏళ్లుగా కబ్జాలో ఉన్న నిర్మాణాలు తొలగించామని ఏవీ రంగానాథ్ పేర్కొన్నారు.
Read also: Terrible Incident: భద్రాద్రి మహిళ మిస్సింగ్ కేసు విషాదాంతం.. 20 ముక్కలు చేసి పొలంలో..
హైడ్రా కమిషనర్ రంగనాథ్.. అంబర్ పేట్ బతుకమ్మ కుంట వద్దకు రావడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ ఇళ్ళను తొలగిస్తారేమో అని స్థానికులు ఆందోళన చెందారు. రంగనాథ్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరించడంతో ఇక తమ ఇళ్లు తప్పకుండా కూల్చేస్తారని భయాందోళన చెందారు. స్థానికులు ఆందోళన చూసిన రంగనాత్ వారితో మాట్లాడుతూ.. కూల్చివేతలు చేపట్టడానికి రాలేదని స్పష్టం చేశారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బతుకమ్మ కుంటలో మొలిచిన చెట్లను JCB తో తొలగిస్తున్నట్లు తెలిపారు. దీంతో స్థానికులు అందరూ రంగనాథ్ మాటలకు చప్పట్లు కొట్టారు. ఇప్పటి వరకు ఉన్న ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చమని హామీ ఇచ్చిచారు. ఇప్పుడు ఉన్న కుంటను అభివృద్ధి చేసి చుట్టూ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానికులతో మాట్లాడిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. హైడ్రా కమిషనర్ హామీతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్