Dogs Attacked: రంగారెడ్డి జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం రోజు రోజుకూ ఎక్కువగా మారుతుంది. మంచాల మండలంలో చిన్నపిల్లలపై, మహిళలపై విచక్షణా రహితంగా కుక్కలు దాడి చేస్తున్నాయి. ఉదయం నడుకుంటూ పోతున్న ఓ మహిళ, ఓ బాలుడి పై దాడి చేసి వారిపై కండలు పీక్కుతిన్నాయి. వారిద్దరూ గట్టిగా కేకలు వేయడంతో అక్కడకు స్థానికులు చేరుకుని కుక్కను తరుముతున్న కుక్కలు దాడి మాత్రం ఆపలేదు. ఓ బాలుడి చేతికి, మహిళలకు కాళ్ల కండరాలను దారుణంగా కర్చాయి. స్థానికులు…
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను హతమార్చిన ఓ తండ్రి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత గ్రామంలో అప్పులు ఎక్కువ కావడంతో మనోవేదానికి గురైన అతడు.. పిల్లలను చంపి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామంలో రవి (35) అనే వ్యక్తి జీఎస్ఎన్ ఫౌండేషన్ పేరుతో మనీ స్కాం…
రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై తెలంగాణ హైకోర్టు ఈ నెల 19 వరకు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులపై ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana: రాష్ట్ర ఇంజినీరింగ్ చరిత్రలో మరో అపూర్వ ఘట్టం ప్రారంభం కానుంది. దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలు కంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కోరికను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చబోతున్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నూతనంగా నిర్మించిన సామాజిక అరోగ్య కేంద్రాన్ని మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రవిచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సబితక్క మనసు నిండా తెలంగాణ వాదం.. ఉద్యమం సమయంలో హోం మంత్రిగా ఉండి ఎంతో సాయం చేశారు.
యువ రైతులు చేస్తున్న వ్యవసాయానికి మంత్రి నిరంజన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవసాయమే ప్రపంచానికి దిక్సూచి.. వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుంది అని అన్నారు. పంట సాగుకు దూరమవుతున్న యువత మీలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలి.. మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలి అని ఆయన పేర్కొన్నారు.
CM KCR: పేద బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో గోపన్నపల్లిలో 6.10 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో విప్రహిత బ్రహ్మణ సంక్షేమ సదనాన్ని ప్రారంభించారు.
రంగారెడ్డి జిల్లాలో క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ అనూహ్య సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఘట్టుపల్లి శివారులోని కేసీఆర్ క్రికెట్ స్టేడియంలో శనివారం ( మే 6 ) జరిగింది.
రాష్ట్రంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ఆరోరోజు కొనసాగుతోంది. ఇవాల్టితో రాహుల్ గాంధీ మొదలు పెట్టిన భారత్ జోడో యాత్రకు 54వ రోజు. ఇవాళ షాద్ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సర్దార్ పటేల్, ఇందిరాగాంధీలకు నివాళులర్పించారు. గుజరాత్ కేబుల్ బ్రిడ్జి విషాద ఘటన బాధితులకు 2 నిముషాలు మౌనం పాటించారు.