భారత దేశంలో వ్యవసాయం దండగ కాదు.. పండగ అనే విధంగా రైతులు నిరంతరం కష్టపడుతుంటారు. అయినా.. వారు పండించిన పంటలకు తగిన మద్దతు ధర లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే, వ్యవసాయం చేసే పద్దతులు మారుతుండటంతో పలువురు దీని వైపు వస్తున్నారు.. కొందరు యువకులు లండన్ లో ఉద్యోగాలను వదిలి ఇక్కడకు వచ్చి పంటలు పండిస్తున్న.. అధిక లాభాలను పొందుతున్నారు.
Read Also: Fahadh Faasil: ఎవర్రా ఈ రత్నవేలు.. సోషల్ మీడియా అంతా ఒకటే మోత
అలాంటి వారే వీళ్లు.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగర్ మియా గూడ యువరైతు అదీప్ అహ్మద్ లండన్ లో ఉద్యోగం వదిలి తెలంగాణకు వచ్చి అవకాడో పంట పండిస్తున్నారు. ఎంటెక్ చదివిన అదీప్ అహ్మద్ 10 ఎకరాలలో బొప్పాయి, జామ, దొండ, వరి సాగు చేస్తున్నాడు. ఇప్పటికే బొప్పాయి సాగుకు మొజాయిక్ వైరస్ సోకడంతో రైతులు దూరమవుతుండగా.. ఇతను మాత్రం దేశీ బొప్పాయి సాగుతో కేజీ రూ.30కి అమ్ముతూ 10 మందికి ఆదీప్ అహ్మద్ ఉపాధి కల్పిస్తున్నారు.
Read Also: Suprem Court: మణిపూర్ హింసపై సుప్రీం సీరియస్.. పూర్తి వివరాలతో రేపు హాజరవ్వాలని ఆదేశం
సివిల్ ఇంజనీరింగ్ చేసి లండన్ లో ఎంబీఏ చదివి ఉద్యోగం వదిలేసి ఎకరా 10 గుంటల భూమిలో అవకాడో పంట పండిస్తున్న కందుకూరు మండలం దెబ్బడగూడ తండాకు చెందిన మరో యువ రైతు జైపాల్ నాయక్.. ఎకరాకు రూ.10 లక్షల వరకు లాభాలు గడిస్తున్నాడు. కల్వకుర్తికి చెందిన వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థి శివకుమార్ యూట్యూబ్ ద్వారా వ్యవసాయ విజయాలను ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. లక్ష మంది సబ్ స్క్రైబర్లతో విజయవంతంగా రైతుల విజయాలను ప్రచారం చేస్తున్నాడు. వీరు వ్యవసాయం మీద ఇష్టంతో చేస్తుండటం ఎంతో గర్వకారణం అని.. ఇలాంటి యువతే రేపటి తరానికి ఆదర్శం అని నిరంజన్ రెడ్డి అన్నారు.
Read Also: Nora Fatehi : క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హాట్ బ్యూటీ..
యువ రైతులు చేస్తున్న వ్యవసాయానికి మంత్రి నిరంజన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవసాయమే ప్రపంచానికి దిక్సూచి.. వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుంది అని అన్నారు. పంట సాగుకు దూరమవుతున్న యువత మీలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలి.. మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలి అని ఆయన పేర్కొన్నారు. సాగు మీద దృష్టి పెట్టి పంటల ఉత్పత్తిలో అద్భుతాలు సృష్టించాలి అని మంత్రి తెలిపారు. సమాజ ఆలోచనా విధానాన్ని సంపూర్ణంగా మార్చాలి.. దానికి మీరు పునాదిరాళ్లు.. మీ నేతృత్వంలో మరింత మందిని వ్యవసాయం వైపు మళ్లించాలి అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.