Heart Attack : క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు… సాప్ట్‌వేర్ ఉద్యోగి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లాలో క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ అనూహ్య సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఘట్టుపల్లి శివారులోని కేసీఆర్ క్రికెట్ స్టేడియంలో శనివారం ( మే 6 ) జరిగింది. మృతుడు మర్రిపూడి మణికంఠది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామమని మహేశ్వరం ఎస్సై నర్సయ్య వెల్లడించారు.
Also Read : Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. 9 మంది…
Also Read
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
మృతుడి సోదరుడు వెంకటేష్ కేబీహెచ్‌పీ కాలనీలో నివాసం ఉంటూ స్టాప్ట్‌వేర్ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నాడు. మణికంఠ ఏడాది నుంచి కేబీహెచ్‌పీ కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడి సొదరుడు వెంకటేష్ మాట్లాడుతూ.. వారంతంలో తామిద్దరం మరికొంతమంది స్నేహితులతో కలిసి స్టేడియంలో క్రికెట్ ఆడుతుంటామని తెలిపారు. మణికంఠ శనివారం ఉదయం ఘట్టుపల్లి శివారులోని స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వెళుతున్నట్లు చెప్పాడన్నారు.
Also Read : RCB vs DC: ఆర్సీబీని చిత్తుచిత్తుగా ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్
తర్వాత మధ్యాహ్నం సోదరుడి స్నేహితుడు యశ్వంత్ తనకు ఫోన్‌చేశాడని, మణికంఠ బ్యాటింగ్ అనంతరం ఒకే ఓవర్ బౌలింగ్ వేసి వెన్నునొప్పి వస్తుందంటూ విశ్రాంతి కోసం కారులో పడుకున్నట్లు చెప్పాడన్నారు. కాసేపటి తర్వాత వెళ్లి మణికంఠను పిలిచినా పలకకపోవడంతో వెంటనే మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారని తెలిపారు. మణికంఠ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నర్సయ్య తెలిపారు. దీంతో మృతుడి ఇంట్లో తీవ్ర విషాదచాయాలు అలుముకున్నాయి. మృతుడు మర్రిపూడి మణికంఠ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!