West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో బుధవారం రామ నవమి సందర్భంగా హింస చెలరేగింది. ఈ సమయంలో రాళ్లతో దాడి చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
Ram Navami violence: రామ నవమి రోజు బీహార్ ససారంలో ఊరేగింపు సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ హింసలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మాజీ బీజేపీ ఎమ్మెల్యే జవహర్ ప్రసాద్ ను రోహ్తాస్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామం బీహార్ రాష్ట్రంలో జేడీయూ వర్సెస్ బీజేపీగా మారింది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జవహర్ ప్రసాద్ ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని…
Ram Navami violence: రామ నవమి పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. రామనవమి ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో పాటు పలు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు. హౌరా, హుగ్లీ, దల్‌ఖోలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. తాజాగా ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేత దర్యాప్తు చేయించాలని గురువారం ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో అనుమతి ఉన్నప్పటికీ రామనవమి ఊరేగింపుపై దుండగులు దాడి చేశారని ఆరోపించిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) పరిగణలోకి తీసుకుంది. ఈ అంశంపై విచారణ జరిపి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హౌరా కమిషనర్ ఆఫ్ పోలీస్‌లకు హక్కు సంఘం నోటీసులు జారీ చేసింది.
Hanuman Jayanti: హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు. గతేడాది అల్లర్లను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నారు. వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధం అయ్యారు.
Anti-India agenda: భారత్ అంటేనే నిలువెల్ల విషంలో మాట్లాడుతుంటుంది ముస్లిం దేశాల కూటమి ‘‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)’’. ఇప్పటికే పలుమార్లు భారత అంతర్గత విషయాలపై స్పందిస్తూ ఇండియాకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసింది. అయితే ఎప్పటికప్పుడు ఐఓసీ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా రామనవమి అల్లర్లపై ఓఐసీ అర్థపర్థం లేని ఆరోపనలు చేసింది. దీంతో మరోసారి తీవ్రంగా స్పందించింది భారత్.
Ram Navami violence: శ్రీరామ నవమి రోజు ఆరు రాష్ట్రాల్లో హింసాకాండ జరిగింది. శ్రీరాముడి ఊరేగింపు సమయంలో రెండు వర్గాల వారు ఒకరిపైఒకరు దాడులు చేసుకోవడం, రాళ్లు రువ్వడం వంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. మహరాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్ లో మరొకరు మరణించారు. మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగింది.