మెగా స్టార్ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేశారు. చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన మెగా కుటంబంలోని నాలుగు తరాల మహిళలు కలిసి వరలక్ష్మీ వ్రతం చేస్తున్న ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో చిరంజీవి భార్య, ఆయన తల్లి అంజనా దేవి, ఉపాసన, శ్రీజ కుమార్తె కూడా ఉన్నారు. “నాలుగు తరాలు కలిసి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నాము” అంటూ ఉపాసన ఈ పిక్…
మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ ఉక్రెయిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని స్టార్ హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఒక రోజు అటూ ఇటూగా హైదరాబాద్ చేరుకున్నారు. అయితే బాలెన్స్ వర్క్ పూర్తి చేయడానికి డైరెక్టర్ రాజమౌళి బృందం ఉక్రెయిన్ లోనే ఉండిపోయింది. శుక్రవారంతో ఆ పనులు కూడా పూర్తి అయిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే… ఇన్ స్టాగ్రామ్ లో ఉక్రెయిన్ లో పాల్గొన్న టోటల్ టెక్నికల్ టీమ్ తో కలిసి రాజమౌళి గ్రూప్ ఫోటో దిగాడు.…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. సామాజిక కథాంశం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నుంచి ‘లాహే లాహే’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్ ను దాటేసింది. Read Also : ఆగష్టు 22న మెగా అప్డేట్… అంతా రాజమౌళి చేతుల్లోనే ? 80+ మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ సాంగ్ విడుదలై చాలా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ విమానాశ్రయంలో కన్పించాడు. ఆ పిక్స్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” చివరి షెడ్యూల్ ని ఉక్రెయిన్ లో ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఈ రోజు ఉదయం ఆయన ఎయిర్ పోర్టులో కంపించడంతో కెమెరాలు క్లిక్ అన్నాయి. చరణ్ బ్లాక్ హూడీ, బ్లాక్ జీన్స్ ధరించి, మ్యాచింగ్ మాస్క్, టోపీ ధరించాడు. అయినప్పటికీ అభిమానులు ఆయనను గుర్తు పట్టేశారు. మిగతా “ఆర్ఆర్ఆర్” టీం…
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 13, 2021 విడుదల కానుంది. కాగా, షూటింగ్ ఇంకా సెట్స్ మీదే ఉండటంతో విడుదల ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, చెప్పిన తేదీకే ఈ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకొచ్చేందుకు రాజమౌళి గట్టిగానే ప్రయాణిస్తున్నారు.…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22 నుంచి ప్రసారం కానుంది. ఇక ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే మెగా పవర్ స్టార్ రాంచరణ్ మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. రాంచరణ్, ఎన్టీఆర్ కలసి ఎంట్రీ ఇస్తున్న ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. చరణ్, ఎన్టీఆర్ మధ్య సరదా సంభాషణలతో ప్రోమో ఆసక్తికరంగా…
టాలీవుడ్ లోని ఓ టాప్ ప్రొడక్షన్ హౌజ్ చరణ్, ప్రభాస్ మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి నటించబోతున్న క్రేజీ మల్టీస్టారర్ కు యువి క్రియేషన్స్ నిర్మించనుంది అంటున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి పాన్ ఇండియన్ సినిమా చేయడానికి యువి క్రియేషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు నిర్మాతలు తమ నిర్మాణ సంస్థలో పని…
“ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్ మరిన్ని రోజులు కొనసాగనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. ముందుగా అనుకున్నదాని ప్రకారం ఆగష్టు 12 లోపు షూటింగ్ పూర్తి చేయాలి. కానీ తాజా బజ్ ప్రకారం సినిమా చిత్రీకరణను మేకర్స్ మరో వారం పొడిగించారు. టీమ్ మరో వారం పాటు షూటింగ్ కొనసాగించనుంది. రాజమౌళిని జక్కన్న అంటారు. అంటే సమయం ఎక్కువగా తీసుకున్నప్పటికీ సినిమాను చెక్కి చెక్కి పర్ఫెక్ట్ గా ప్రేక్షకుల…
“ఆర్ఆర్ఆర్” తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించనున్న చిత్రం “ఆర్సి15”. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటికే కీసర అద్వానీని హీరోయిన్ గా ప్రకటిచారు. “భరత్ అనే నేను”, “వినయ విధేయ రామ” తర్వాత ఆమె చేస్తున్న మూడో తెలుగు ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు “వకీల్ సాబ్” బ్యూటీ కూడా ఇందులో హీరోయిన్ గా నటించబోతోంది అంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెండవ మహిళా…
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్”.. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది.…