చిరు 43 ఏళ్ళ ప్రయాణం… చరణ్ స్పెషల్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 22న మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఓ ప్రత్యేకమైన రోజు. చిత్ర పరిశ్రమలో ఆయన విజయవంతంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు ఓ స్పెషల్ ట్వీట్ చేస్తూ “43 ఇయర్స్ అండ్ స్టిల్ కౌంటింగ్… మై అప్పా” అంటూ లవ్ సింబల్ ను యాడ్ చేశారు. అంతేకాకుండా 43 ఏళ్ళ క్రితం నాటి ఫోటో, తాజాగా ఆయన నటిస్తున్న ఆచార్య సినిమాలోని పిక్ ను షేర్ చేశారు.
ఇక చిరు నిన్ననే తన కెరీర్‌లో అంతులేని మద్దతునిచ్చిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ చిరంజీవి తన తొలి సినిమా” ప్రాణం ఖరీదు” నుండి త్రోబాక్ చిత్రాన్ని పంచుకున్నారు. “ఆగస్టు 22న నేను మనిషిగా జన్మించాను. సెప్టెంబర్ 22న నేను నటుడిగా జన్మించాను. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయం చేసి మీ ఆశీస్సులు పొందిన రోజు. నేను మరిచిపోలేనిరోజు. అప్పటి నుండి నన్ను ప్రోత్సహించిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్న నా అభిమానులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అంటూ చిరు ట్వీట్ చేశారు.
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
Read Also : కాస్ట్లీ కారు కొన్న “బిగ్ బాస్” బ్యూటీ
సెప్టెంబర్ 22, 1978 న “ప్రాణం ఖరీదు”తో చిరంజీవి అరంగేట్రం చేశారు. సరిగ్గా ఒక నెల క్రితం ఆగస్టు 22 న చిరు తన 66వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “ఆచార్య”లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ రాజాతో “గాడ్ ఫాదర్”, మెహర్ రమేష్‌తో “భోళా శంకర్”, దర్శకుడు బాబీతో ఒక సినిమా లైన్ లో పెట్టారు చిరు.
43 years and still counting!
My Appa @KChiruTweets ❤️ pic.twitter.com/2th29femzz— Ram Charan (@AlwaysRamCharan) September 23, 2021
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!