నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, రాజస్థాన్‌లలోని నాలుగేసి స్థానాల ఫలితాలు మాత్రమే వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్, బీజేపీలకు చెరో నాలుగు స్థానాలు దక్కాయి. మహారాష్ట్రలో ఆరు, హరియాణాలో రెండు స్థానాలకు ఎన్నికలు ముగిసినా.. అక్కడ ఓట్ల లెక్కింపు జరగలేదు. బీజేపీ ఫిర్యాదుతో హరియాణా, మహారాష్ట్రలో ఓట్ల లెక్కింపు నిలిపేసింది ఎన్నికల సంఘం. రెండు రాష్ట్రాల్లోని ఫలితాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలో నాలుగు స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగగా.. మూడు స్థానాలను…
నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ పూర్తయిన గంట అనంతరం.. ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇటీవల మొత్తం 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ వెలువడగా.. 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల పరిధిలో 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. Rajyasabha Polls: ఉత్కంఠగా రాజ్యసభ ఎన్నికలు..…
నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 57 సీట్లకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక జరగనుంది. హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణకు ఈసీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న…
తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించాలని నిర్ణయించుకుంది బిజెపి. దక్షిణాదిలో మరో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్ర నేతలు కూడా ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ విషయంలో వేగంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణపై దృష్టి పెట్టామని..రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నామని ఇక్కడి నేతలకు బలమైన సంకేతాలు ఇచ్చేలా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోడీ హైదారాబాద్‌కు వచ్చినప్పుడు పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో ప్రసంగించారు. పార్టీ ముఖ్య నేతలు సైతం తెలంగాణలో రెగ్యులర్‌గా పర్యటిస్తున్నారు.…
రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిపై కసరత్తు చేస్తున్న బీజేపీ నలుగురు అభ్యర్ధులతో రెండో జాబితా విడుదల చేసింది. తెలంగాణనుంచి బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్‌కు రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశారు. ఆయనకు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించింది. యూపీనుంచి మిథిలేశ్ కుమార్ లక్ష్మణ్, డాక్టర్ లక్ష్మణ్, కర్ణాటకనుంచి లహర్ సింగ్ సిరోయ, మధ్యప్రదేశ్ నుంచి సుమిత్ర వాల్మికి అభ్యర్థిత్వాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయం ఖరారు చేసింది. తెలంగాణకు నుంచి రాజ్యసభకు ఎంపిక అయిన డాక్టర్ కే.లక్మణ్…
బీసీ ఉద్యమనేత ఆర్.కృష్ణయ్య రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. ఏపీ నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఆయనను ఎంపికచేశారు సీఎం, వైసీపీ అధినేత జగన్. ఉద్యమకారుడైన కృష్ణయ్యను జగన్ ఎంపిక చేయడం వెనకాల బీసీలకు న్యాయం చేయాలని తపన వుంది. తెలంగాణలో బీసీ ఉద్యమాలు చేసిన కృష్ణయ్యను జగన్ గుర్తించారు.కానీ సీఎం కేసీఆర్ తనను గుర్తించారని, కానీ ముందుగా జగన్ అవకాశం ఇచ్చారన్నారు. ఈ పదవి వెనుక కేసీఆర్ హస్తం వుందనేది సరైన ప్రచారం అన్నారు. బీసీలు బాగుండాలి, బీసీలు…
ఏపీ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైసీపీ తరఫున మరోసారి అవకాశం దక్కించుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. నాలుగు స్థానాల్లో విజయసాయిరెడ్డితో పాటు నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులను జగన్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీవీతో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. నా పై అచంచల విశ్వాసం ఉంచి రాజ్యసభకు మరోసారి పంపిస్తున్న ముఖ్యమంత్రి దంపతులు జగన్, భారతి లకు ధన్యవాదాలు తెలిపారు. నా పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా…
తెలంగాణలో అధికారపార్టీ టీఆర్ఎస్‌లో ఒక్కసారిగా వేడి పుట్టింది. దీనికి కారణం రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్ రావడమే. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్‌ను రాజీనామా చేయించి.. ఎమ్మెల్సీని చేశారు. దీంతో ఆ రాజ్యసభ స్థానానికి 2024 ఏప్రిల్ వరకు పదవీకాలం ఉండిపోయింది. ఆ భర్తీ ప్రక్రియలో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దాంతో టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థి ఎవరు అనే అంశం చుట్టూ చర్చ ఊపందుకుంటోంది. రెండేళ్లే పదవీకాలం ఉన్నప్పటికీ చాలామంది టీఆర్‌ఎస్ నేతలు…
‘పెద్లల సభ’ అంటే రాజ్యసభ, దానినే ఎగువ సభ అనీ అంటారు. ఈ సభలో మన సినీజనం అనే శీర్షిక చూడగానే, ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఓ నటుడు రాజ్యసభకు వెళ్ళనున్నారని వినిపిస్తోన్న అంశం గుర్తుకు రాకమానదు. ఇంతకూ పెద్దల సభలో మన సినీజనం ఎవరెవరు ఎలా అడుగు పెట్టారన్నది ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. యన్టీఆర్ తరువాతే…!‘భారత రాజకీయాలందు తెలుగు రాజకీయాలే వేరయా’ అన్నట్టుగా మన రాజకీయం సాగుతూ ఉంటుంది. తెలుగు నాట…
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్‌ఎస్ కూడా భగ్గుమంటోంది. టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు మోడీపై ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు. 187వ నిబంధన కింద టీఆర్‌ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో…