TRS రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్.. కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 24న కాంగ్రెస్ అధినేత్రి సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత కారు ఎక్కిన ఆయన.. తిరిగి సొంత గూటికి వస్తున్నారు. ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీ సి సి అధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే తగిన ప్రాధాన్యత…
శీతకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యా సభలో జీరో అవర్‌లో కడప జిల్లాలో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. టెక్స్‌టైల్ పార్క్ ఆవశ్యకతను వివరించారు. కొప్పర్తిలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 4,445 కోట్ల రూపాయల వ్యయంతో దేశ వ్యాప్తంగా ఏడు “మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్”, “అప్పరెల్ పార్కు” (మిత్రా) చేయాలని నిర్ణయించిందని దీన్లో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని…
టీఆర్‌ఎస్ నేత బండ ప్రకాష్ రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామా లేఖను బండ ప్రకాశ్ సమర్పించారు. ఇటీవలే బండ ప్రకాశ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు. వరంగల్‌లో 1954 ఫిబ్రవరి 18న జన్మించారు బండప్రకాశ్. ఎంఏ, పీహెచ్‌డీ చేశారు ప్రకాష్. కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నుండి 1996లో పి.హెచ్.డి పట్టా పొందారు. తెలంగాణలోని పలు సామాజిక, స్వచ్ఛంద సంఘాలకు అధ్యక్షునిగా, కార్యదర్శిగా…
లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో సభను నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పెద్దల సభగా పెరుపొందిన రాజ్యసభలోనూ సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు నిరసనలు తెలియజేశాయి. ఎంపీలు నిలబడి, బల్లలపైకి ఎక్కి పెద్దగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. విపక్షాల ఆందోళనలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ ఒక దేవాలయం వంటిదని, కొందరు ఎంపీలు అమర్యాదగా ప్రవర్తించారని, పోడియం ఎక్కి నిరసనలు చేయడం అంటే, గర్భగుడిలో నిరసనలు చేయడమే అని రాజ్యసభ…