రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో ఎంపీ జోగినపల్లి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మీద ప్రత్యేక వ్యాసాన్ని డిసెంబర్ సంచికలో ప్రచురించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్-బిల్డింగ్ బెటర్ టుమారో పేరిట ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించింది.
రాజ్యసభ ఎంపీగా ప్రముఖ మాజీ క్రీడాకారిణి పీటీ ఉష ప్రమాణస్వీకారం చేశారు. ఆమె హిందీలో భాషలో ప్రమాణం చేసింది. ఇటీవల ప్రఖ్యాత స్వరకర్త ఇళయరాజా, ఫిల్మ్ రైటర్ విజయేంద్ర ప్రసాద్, ఆధ్యాత్మిక నాయకుడు వీరేంద్ర హెగ్గడేతో పాటు ఉష పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ చేయబడింది. ఉషను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభకు నామినేట్ చేసింది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ పుణేలో కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్ళు. గత కొద్ది రోజులుగా ఆయన న్యుమోనియా, గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. దీంతో ఆయన ఇవాళ మధ్యాహ్నం 2. 30 గంటలకు తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. గతేడాది ఏప్రిల్‌లో బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాహుల్ బజాజ్ రాజీనామా చేశారు. 40…