PM Modi: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఎన్నికల్లో గెలవలేని వారు, రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యులు అయ్యారు.’’ అని అన్నారు.
ప్రముఖ విద్యావేత్త సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసారు. ప్రెసిడెంట్ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసిన విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఉమెన్స్ డే రోజున ఈ ప్రకటన వెలువడడం విశేషం.
రాజ్యసభ ఎంపీలపై ఆసక్తికరమైన ఏడీఆర్ నివేదిక వెలువడింది. రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల్లో (Rajya Sabha MPs) 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు(Criminal Cases) ఉన్నట్లు ఎన్నికల హక్కుల సంఘం ఏడీఆర్(ADR) నివేదిక తెలిపింది.
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు సీట్లకు మూడు నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కాగా.. రేపు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రేణుకా చౌదరి తీసుకోనున్నారు. మరోవైపు.. అనిల్ కుమార్ యాదవ్ కు రిటర్నింగ్ అధికారులు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేశారు.
BJP: లోక్సభ ఎన్నికల ముందు దేశంలో రాజ్యసభ సందడి నెలకొంది. పలువురు నాయకులు తమ పదవీ కాలం పూర్తి చేయడంతో వివిధ పార్టీల తమ అభ్యర్థులన్ని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ మాజీ అధినేత్రి తొలిసారిగా లోక్సభను వీడి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్బరేలీ నుంచి ఆమె 2024 ఎన్నికల్లో పోటీ చేయదని తెలుస్తోంది.