PM Modi: మంగళవారం లోక్‌సభలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ప్రధాని నరేంద్రమోడీ బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ, మరోసారి కాంగ్రెస్‌ని టార్గెట్ చేశారు.
Akhilesh Yadav : లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్ లీక్ విషయంలో అఖిలేష్ మాట్లాడుతూ.. ఎవరికీ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేపర్ లీక్ చేస్తుందన్నారు. అలాగే, ఈవీఎంల విషయంలో మేం ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని, దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని అఖిలేష్ అన్నారు. అగ్నివీర్ పథకం రద్దుపై అఖిలేష్ మరోసారి మాట్లాడారు. మంగళవారం…
గత వారం పార్లమెంట్ ఉభయ సభలు హాట్ హాట్‌గా సాగాయి. ఇక రాజ్యసభలో అయితే ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్-కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం సాగింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో సభా నాయకుడిగా నియమితులయ్యారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో హౌస్ లీడర్‌గా నియమితులయ్యారని ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా.. రాజ్యసభ సభా నాయకుడిగా నియమితులయ్యారు. జేపీ నడ్డాను రాజ్యసభలో సభాపక్ష నేతగా చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇంతకుముందు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సభలో ఈ బాధ్యతను నిర్వహించేవారు.. అయితే అతను నార్త్ ముంబై లోక్‌సభ స్థానం నుండి ఎంపీగా ఎన్నికైన తరువాత, అతను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో.. ఈ బాధ్యతను జేపీ నడ్డాకు అప్పగించారు. ఈ నెల ప్రారంభంలో..…
బీజేపీ రాజ్యసభ ఎంపీ జేపీ నడ్డా.. మోడీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే కీలకమైన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖలను అప్పగించారు.
ఆయా పార్టీల్లో ఉన్న ఆశావాహులకు మరో లక్కీ ఛాన్స్ దక్కనుంది. లోక్‌సభ ఎన్నికల పుణ్యమా? అంటూ రాజ్యసభలో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో త్వరలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ రానుంది.
PM Modi: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఎన్నికల్లో గెలవలేని వారు, రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యులు అయ్యారు.’’ అని అన్నారు.