Rajya Sabha: పెద్దల సభలో చైర్మన్ జగదీప్ ధంఖర్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. శుక్రవారం వీరిద్దరి మధ్య రాజ్యసభలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దంఖర్ మాట్లాడే విధానం సరిగా లేదని, ఆయన స్వరం ఆమోదయోగ్యం కాదని జయా బచ్చన్ చెప్పడంతో ఒక్కసారిగా సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన చైర్మన్ ధంఖర్..‘‘నాకు చదువు చెపొద్దు’’ అని అన్నారు.
పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్ మ్యాచ్కు ముందు వేటుకు గురైన భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ను రాజ్యసభకు పంపాలని డిమాండ్ పెరిగింది. ఆమె వేటుకు గురైనప్పుడు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది.
ఒలింపిక్స్ నుంచి వినేష్ ఫోగట్ నిష్క్రమణపై రాజ్యసభలో ఈరోజు పెద్ద దుమారం చెలరేగింది. వాస్తవానికి ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తేందుకు ప్రతిపక్ష నేత ఖర్గే ప్రయత్నించగా, ఛైర్మన్ అనుమతించలేదు.
రాజ్యసభలో మరోసారి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్.. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ‘జయా అమితాబ్ బచ్చన్’ అంటూ పూర్తి పేరుతో చైర్మన్ సంబోధించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త డ్రామా ప్రారంభించారంటూ జయా బచ్చన్ మండిపడ్డారు.
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. సీటు లభిస్తే.. ఉచితం విద్య లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇందులో సీటు కోసం తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇందులో సీటు కోసం ఎంపీల సాయంతో లభించేది. అయితే ఈ విధానం కొద్ది రోజులగా బ్రేక్ పడింది.
కేరళ విలయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో స్పందించారు. వయనాడ్లో కొండచరియలు విరిగిపడగానికి వారం రోజుల ముందే కేరళలోని పినరయ విజయన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు.
నిపా వైరస్కు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో వెల్లడించారు. నిపా, కోవిడ్-19 వంటి అంటువ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయని ఆయన అన్నారు. జంతువులతో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ వ్యాధులు మానవులలో వ్యాపించాయని చెప్పారు. అటువంటి ఉద్భవిస్తున్న వ్యాధులను ఎదుర్కోవటానికి.. మానవ, జంతువు.. పర్యావరణ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి ఉద్ఘాటించారు.
దేశ రాజధానిలో దిగ్భ్రాంతకర ఘటన చోటు చేసుకుంది. ఐఏఎస్ కావాలని కలలు గన్న ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో భవనం బేస్మెంట్లో నీటిలో చిక్కుకుని జల సమాధి అయ్యారు.
రాజ్యసభలో ఎన్డీఏకు బలం తగ్గిపోయింది. బిల్లులు ఆమోదం పొందాలంటే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో.. ఎన్డీఏ సంఖ్య 101కి పడిపోయింది.
BJD: గత 10 ఏళ్లుగా మోడీ ప్రభుత్వానికి అండగా నిలిచిన నవీన్ పట్నాయక్ ‘‘బిజూ జనతాదళ్(బీజేడీ)’’ పార్టీ బీజేపీకి షాక్ ఇచ్చింది. రాజ్యసభలో పలు బిల్లులను క్లియర్ చేసేందుకు బీజేడీ ఎంపీలు చాలా సార్లు బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేశారు.